నాభి అందాలతో కైపెక్కిస్తోన్న యాంకర్ విష్ణు ప్రియ

0

బుల్లితెరపై ఇప్పటి వరకు చాలా మంది యాంకర్లు వచ్చారు. వారిలో నిలదొక్కుకున్నది మాత్రం చాలా కొద్దిమందే. నిజానికి బుల్లితెర యాంకరింగ్ సినిమాల్లో నటించడం కన్నా కష్టమైన పని. ఎందుకంటే.. సందర్భానికి తగ్గట్టు స్పందించాలి, నవ్వించాలి, పంచ్‌లు వేయాలి, ప్రోగ్రామ్‌ను ఆద్యంతం వినోదభరితంగా నడిపించాలి. అంటే, వాక్ చాతుర్యం బాగా ఉండాలి. అందుకే, సుమ కనకాల కొన్నేళ్లుగా బుల్లితెరను ఏలుతున్నారు. ఆమె తరవాత అనసూయ ఉన్నారు. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ షోతో రష్మి కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. వీరితో పాటు తాను కూడా ఉన్నానని యాంకర్ విష్ణు ప్రియ ప్రస్తుతం నిరూపంచకునే పనిలో ఉన్నారు.

‘పటాస్’ ప్రోగ్రామ్‌తో గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ ప్రస్తుతం సుధీర్‌తో కలిసి ‘పోవే పోరా’ కార్యక్రమం చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. దీంతో పాటు అప్పుడప్పుడు వేరే కార్యక్రమాల్లోనూ కనిపిస్తోంది విష్ణు ప్రియ. ఏ ప్రోగ్రాంలో పాల్గొన్నే విష్ణు ప్రియపై ఒక కామన్ కామెంట్ ఉంటుంది. అది ఆమె ముక్కుపై. విష్ణు ప్రియ ముక్కు కాస్త పెద్దదిగా ఉండటంతో కామెడీని పండించడానికి అంతా దాన్నే టార్గెట్ చేస్తున్నారు. నిజానికి విష్ణు ప్రియ అందానికి ఫిదా అయిపోయే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.

తన అందమైన ఫొటోలను విష్ణు ప్రియ ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. వీటిలో కొన్ని హాట్ ఫొటోలు కూడా ఉంటాయి. తాజాగా అలాంటి ఫొటోలే కొన్ని పోస్ట్ చేసింది. నాభి అందాలను ప్రదర్శిస్తూ వెరైటీ సారీలో విష్ణు ప్రియ అదరగొట్టింది. ఈ ఫొటోలు చూసిన ఆమె అభిమానులు సూపర్, ఫైర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బుల్లితెర యాంకర్‌గా మారక ముందు విష్ణు ప్రియ సీరియల్స్, వెబ్ సిరీస్‌లో నటించింది. కానీ, అప్పుడు అంత గుర్తింపు రాలేదు. కానీ, ఇప్పుడు యూత్‌లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను మరింత పెంచుకోవాలని చూస్తున్నారు విష్ణు ప్రియ.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-