#మహమ్మారీ.. యాంకర్ల జీవితాలపై బిగ్ పంచ్!

0

అయ్యో పాపం యాంకర్లు.. ఇంతకీ ఏం చేస్తున్నారు? ఇన్నాళ్లు ఒక్కో ఈవెంట్ కి లక్షల్లో ఆర్జించి వేలల్లోకి పారితోషికాలు తగ్గినప్పుడు ముఖం తిప్పేసుకుని నిర్మాతల్ని నానా ఇబ్బందులకు గురి చేసిన యాంకర్లు అంతా ఇప్పుడేం చేస్తున్నారు? మహమ్మారీకి భయపడి దాక్కున్నారా? బుల్లితెర షూటింగులు షురూ చేసినా ఎవరి సందడి కనిపించదేమిటి ఇంకా?

ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్ ఇది. ఒకప్పుడు సినిమా ఈవెంట్లతో ఒకటే కళకళలాడేది ఇండస్ట్రీ. మూణ్ణెలలుగా సీన్ మారిపోయింది. నిరంతరం ఆడియో ఫంక్షన్లు.. ప్రీరిలీజ్ ఈవెంట్లు.. రిలీజ్ ఈవెంట్లు.. పార్టీలు అంటూ ఒకటే తళుకుబెళుకుల ప్రపంచంలో ఎంజాయ్ మెంట్ ఉండేది. ఈవెంట్ల పేరుతో యాంకర్ల రెవెన్యూ నెలవారీగా చూస్తే ఓ రేంజులోనే ఉండేది. ఇటీవల పలువురు యాంకర్లు బీఎండబ్ల్యూ.. ఆడి.. బెంజ్ రేంజ్ హై క్లాస్ కార్లను చేజిక్కించుకున్నారంటే ఏ రేంజులో ఆర్జించారో అంచనా వేయొచ్చు. కొందరు యాంకర్లు అయితే సినిమా అవకాశాలు అందిపుచ్చుకుని లక్షల్లో పారితోషికాలు అందుకున్నారు. ఇప్పుడు అలాంటివాళ్లంతా ఖాళీ.

ఉన్నట్టుండి ఎదిగారు. కానీ ఇంతలోనే ఇలా అయ్యింది. అకస్మాత్తుగా ఇంతగా ఓ వెలుగు వెలిగిన యాంకర్ల జీవితాలన్నీ తల్లకిందులయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మహమ్మారీ దెబ్బ కేవలం సినీపరిశ్రమలో ఏ ఒక్కరిపైనో కాదు.. ఇటు సెకండరీ వర్కర్లపైనా అంతే తీవ్రంగా పడిందన్నది ఓ విశ్లేషణ. ఇప్పుడున్న టాప్ రేంజ్ యాంకర్లలో ఎవరో నలుగురైదుగురు మినహా ఇతరులంతా ఖాళీ అయిపోయారు. ఈవెంట్లు జీరో.. ఫంక్షన్లు- పార్టీలు జీరో. దీంతో ఉపాధి కరువై అయోమయ స్థితి నెలకొంది. కొందరు యాంకర్లు అయితే వేలల్లో జీతాలిచ్చి పర్సనల్ అసిస్టెంట్ల(మేకప్-డ్రైవర్)ను పోషించేవారు. ప్రస్తుతం వారికి జీతాలివ్వలేని పరిస్థితిలో ఉద్యోగాల నుంచి తొలగించేశారట. అయ్యో ఏమిటీ కష్టకాలం. ఇంతగా వేధిస్తోంది!! కరోనా యాంకర్ల పాలిట యమకింకర పాశంలా మారింది.
Please Read Disclaimer