నోరు జారిన పెళ్లాం.. కవరింగ్ కోసం హీరోగారి తంటాలు!!

0

నటి.. మోడల్ .. రియాలిటీ హోస్ట్ నేహా ధూపియా గురించి పరిచయం అవసరం లేదు. బుల్లితెర వేదికగా రకరకాల వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ అమ్మడు నిరంతరం హాట్ టాపిక్ అవుతుంటుంది. మహిళా సాధికారత గురించి స్పీచ్ లు దంచే ఈ అమ్మడు ఇటీవల చేసిన ఓ కామెంట్ ఫ్యాన్స్ ని వేడెక్కించింది.

జూలీ లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలతో ఆడియెన్స్ మత్తెక్కించిన ఈ భామ చాలా వరకు ఆ తరహా సినిమాల్లోనే నటించింది. అయితే ఇటీవల ఒక బిడ్డ తల్లి అయ్యాక మాత్రం కాస్త నేహా తీరు మారినట్టే కనిపిస్తోంది. ఇటీవల కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటోంది. అలాంటి చిత్రాల్లో నటించాల్సిన అవసరం తనకు లేదని చెప్పేసింది. అలాగే చాలా సెలక్టీవ్ గానూ సినిమాలు చేస్తోంది.

సినిమాలతోపాటు టెలివిజన్ షోస్ కి హోస్ట్ గానూ వ్యవహరిస్తోంది. తాజాగా ఆమె ఎంటీవీలో ప్రసారమయ్యే రోడీస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఇందులో పాల్గొన్న యువకుడు తన ప్రియురాలు ఓ ఐదుగురు కుర్రాళ్ళతో తిరుగుతోందని.. తనని మోసం చేసిందని పేర్కొన్నాడు. అంతటితో ఆగలేదు. ఆమెని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆ షో వివాదాస్పదం కావడమేకాదు.. హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబ్ లో ఆ వీడియో ప్రస్తుతం జోరుగా వైరల్ అవుతోంది.

అయితే ఈ షోలో ఐదుగురు బోయ్ ఫ్రెండ్స్ ఉన్న ఆ అమ్మాయికి నేహా మద్దతు పలికడం పలు విమర్శలకు తావిచ్చింది. “అది ఆమె ఇష్టం“ అని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టిన నేహా నైజంపై జనం చీవాట్లు పెట్టేస్తున్నారు. దీంతో ప్రేమించి మోసం చేసిన వారిని సమర్ధిస్తారా? అంటూ నెటిజనులు నేహాపై ఫైర్ అయ్యారు. ఆమెని ట్రోల్ చేయడం ప్రారంభించారు.

దీంతో నేహాకి తన వ్యాఖ్యలను సవరించుకోవాల్సి వచ్చింది. అందుకు ఓ పెద్ద లెటర్ ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. మహిళలపై జరిగే హింసని వ్యతిరేకిస్తానని తెలిపింది. ఇది చూసి తన భర్త అంగద్ బేడీ ఆమె పై సెటైర్ వేశారు. “వీరే నా ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్“ అయిదుగురు అమ్మాయిలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో సర్ ప్రైజ్ ఏంటంటే ఆ అయిదుగురు అమ్మాయిలు నేహానే కావడం విశేషం. అంగద్ నటుడిగా.. మోడల్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో `కార్గిల్ గర్ల్: గుంజన్ సక్సేనా` బయోపిక్ లో నటిస్తున్నారు. నేహా ధూపియా ప్రస్తుతం `దేవి` అనే ఓ లఘు చిత్రంలో నటిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-