సరిలేరు – నిజాలు చెప్పేదెవరు!

0

మహేష్ బాబు 26వ సినిమా సరిలేరు నీకెవ్వరూ నుంచి జగపతి బాబు తప్పుకుని ప్రకాష్ రాజ్ ని రీ ప్లేస్ చేయడం గురించి జగ్గు భాయ్ వీడియో రూపంలో క్లారిటీ ఇచ్చాడు కానీ దానికి సంబందించిన కారణాలు మాత్రం బయటికి చెప్పలేదు. ఈ ఆఫర్ కోసం వేరే రెండు మంచి ప్రాజెక్ట్స్ వదులుకున్నాను అంతగా ఈ పాత్ర నచ్చిందని చెప్పిన జగపతి బాబు ఇంత తక్కువ గ్యాప్ లో ఎందుకు వదిలేసుకోవాల్సి వచ్చిందో మాత్రం వివరించలేదు. అంటే చెప్పకూడని కారణమే అయ్యుంటుంది.

అంతర్గతంగా ఏవో విభేదాలు వచ్చాయని తన పాత్ర గురించిన ఈయనకు దర్శకుడు అనిల్ రావిపూడికి విభేదాలు వచ్చాయని అందుకే హైదరాబాద్ షెడ్యూల్ మొదలుకాక ముందే ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ గాసిప్ ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈ సంఘటన ఇండస్ట్రీలో ఉన్న లుకలుకలను బయటపెడుతోందని ఫిలిం నగర్ లో చర్చ జరుగుతోంది. అంత మనసుకు నచ్చిన పాత్ర అయినప్పుడు ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందనే సందేహం ఎవరికైనా రావడం సహజం. అది ఓపెన్ గా చెప్పలేనిది అంటే ఇంకో చర్చకు అవకాశం ఇచ్చినట్టే కదా.

విడుదల చేసిన వీడియోలో కూడా జగపతి బాబు పదే పదే మిస్ అవుతున్నందుకు బాధ పడుతున్నాను అని చెప్పారు తప్ప ఎందువల్ల అనే దాని గురించి చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. ఒకవేళ జగపతి బాబు కంటే ప్రకాష్ రాజ్ ని బెటర్ ఛాయస్ అనుకున్నారా లేక ఇంకేదైనా తెరవెనుక రహస్యం ఉందా అది అనిల్ రావిపూడి-జగపతిబాబు-మహేష్ ఈ ముగ్గురి కంటే బాగా ఇంకెవరికి తెలిసే ఛాన్స్ లేదు. వాళ్ళూ చెప్పే ఛాన్స్ లేదు కాబట్టి ఇది ఇప్పట్లో తేలే అవకాశం లేనట్టే!
Please Read Disclaimer