ఈ రైలు కూత పెట్టింది మొదలు పరుగే పరుగు!

0

మహేష్ కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `సరిలేరు నీకెవ్వరు` జెట్ స్పీడ్ తో పూర్తవుతున్న సంగతి తెలిసిందే. స్క్రిప్టు వర్క్.. షెడ్యూల్స్.. రిలీజ్ తేదీ సహా ప్రతిదీ ఎంతో క్లారిటీగా వెళుతున్న అనీల్ రావిపూడి చెప్పిన దాని ప్రకారమే ఒక్కో షెడ్యూల్ ని ముగించేస్తున్నాడు. కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని తదుపరి హైదరాబాద్ షెడ్యూల్ ని అంతే వేగంగా పూర్తి చేసేస్తున్నాడట.

హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ సహా రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్లు వేసి షూటింగ్ చేస్తున్నారని ఇదివరకూ వెల్లడించాం. ఒక భారీ ట్రైన్ సెట్ ని నిర్మించి అందులో దాదాపు అర్థగంట పాటు సన్నివేశాన్ని తెరకెక్కించనున్నారని చెప్పుకున్నాం. ప్రస్తుతం ఈ సీక్వెన్స్ చిత్రీకరణ పూర్తి చేశారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సన్నివేశం ఆద్యంతం హిలేరియస్ కామెడీ పొట్ట చెక్కలయ్యేలా చేస్తుందట. దీంతో ప్యాచ్ వర్క్ మినహా మొత్తం షెడ్యూల్ పూర్తయినట్టే. అలాగే ప్రథమార్థం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఒకే ఒక్క యాక్షన్ సీన్ మినహా చిత్రీకరణ పూర్తి చేశారు. తదుపరి రామోజీ ఫిలింసిటీలో కర్నూల్ సెట్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉంటుంది. ఇక ఇందులోనే ద్వితీయార్థానికి సంబంధించి కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. నవంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్ ఆద్యంతం ప్రమోషన్స్ చేయాలన్నది ప్లాన్. సంక్రాంతి 2020 రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి అందుకు సౌకర్యవంతంగా సినిమాని పూర్తి చేసి ప్రచారానికి ప్లాన్ చేశారు.

తాజాగా ఈ చిత్రంలో లేడీ బాస్ విజయశాంతి లుక్ ఎలా ఉండబోతోందో నేడు రిలీజైన లీక్డ్ ఫోటో క్లూ ఇచ్చింది. ఇందులో విజయశాంతి రష్మికకు మదర్ పాత్రనా? అంటే కానే కాదని మహేష్ పాత్రకు సమాంతరంగా లీడ్ చేసే పాత్ర ఇదని ఇదివరకూ విజయశాంతి తెలిపారు. ఇక మునుముందు ఈ సినిమాకి సంబంధించి మరిన్ని సంగతులు అధికారికంగా తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer