క్లాస్ మేట్స్ అంతేగా అంతేగా!

0

టాలీవుడ్ లో సుదీర్ఘ ఇన్నింగ్స్ ని సాగించిన ఏకైక క్యారెక్టర్ ఆర్టిస్టు ఎవరు? అంటే బ్రహ్మాజీ పేరు చెప్పొచ్చు. పృథ్వీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అయితే.. 30 ప్లస్ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన. టాలీవుడ్ లో ఈయన చేయని పాత్ర లేదు. హీరోలకు ఫ్రెండ్గా.. విలన్గా.. తమ్ముడిగా.. అన్నగా – సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఆల్ రౌండర్ గా అన్ని రకాల పాత్రల్లో నటించారు. ఇప్పటికీ నటిస్తున్నారు. సింధూరం చిత్రంలో రవితేజతో కలిసి హీరోగా నటించారు. కానీ హీరోయిజం తనకు సూట్ కాలేదు. అటుపై క్యారెక్టర్లతో సరిపెట్టుకున్నారు. తాజాగా `సైరా నరసింహారెడ్డి` చిత్రంలో చిరంజీవికి సహాయకుడిగా కూడా నటించి ఆకట్టుకున్నారు బ్రహ్మాజీ. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆయన ఏజ్ మాత్రం పెరగడం లేదని.. ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నాడని సినీవేడుకల్లో యాంకర్ సుమ బ్రహ్మాజీని ఓ ఆట ఆడుకుంటూ వుంటుంది. వీరిద్దరి సంభాషణలు నవ్వుల పువ్వులు పూయిస్తూ అహూతుల్ని రంజింపజేస్తాయి.

అయినా బ్రహ్మాజీ ఏ వేదికపైనా తన ఏజ్ గురించి అస్సలు చెప్పలేదు. సుమ కంటే ఐదేళ్లు చిన్న వాడినే అంటూ కవర్ చేసుకుంటుంటాడు. దీంతో సుమ మరో ఫంక్షనలో దొరక్కపోతాడా? అప్పుడు ఆడుకోకపోతానా? అని వదిలేస్తూ వుంటుంది. ఇలా గత కొన్నేళ్లుగా తన ఏజ్ ని దాచుకుంటూ వీలైతే తగ్గించుకుంటూ వస్తున్న బ్రహ్మాజీ తాజాగా యంగ్ ఎనర్జిటిక్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తను క్లాస్ మేట్స్ అంటూ ట్వీట్ చేసిన ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. `వియ్ ఆర్ క్లాస్ మేట్స్ వన్స్. అతని సెట్ కి మరోసారి రావడం ఆనందంగా వుంది` అంటూ ఒకే రకం రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని అనిల్ రావిపూడితో కలిసి పోజిచ్చాడు బ్రహ్మాజీ.

దీనికి కౌంటర్ గా కోపంగా వున్న బ్రహ్మాజీ ఫొటోని ట్వీట్ చేసి అన్న ఫైర్!! అంటూ అనిల్ రావిపూడి చేసిన ట్వీట్ కూడా ఆకట్టుకుంటోంది. “సేమ్ గ్లాస్ అని ఫొటో తీసి .. సేమ్ క్లాస్ అంటావా… మీ సినిమాలు చూస్తూ పెరిగాను అన్నగారు అంటూ దీనికి వెన్నెల కిషోర్ ఇచ్చిన మరో పంచ్ అదిరిపోయింది. “బ్రహ్మాజీగారి సినిమాలు చూస్తూ మా నాన్న పెరిగారు. ఇప్పటికీ నేనూ ఆయన సినిమాలు చూస్తూ పెరుగుతున్నాను“ అంటూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Please Read Disclaimer