ఎఫ్2 పై కాదు ఎఫ్3 పైనే మొత్తం ఫోకస్

0

మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రంను చేసిన దర్శకుడు అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 2 హిందీ రీమేక్ కు వర్క్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బోణీ కపూర్ నిర్మిస్తున్న ఎఫ్ 2 రీమేక్ కు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడంటూ.. హిందీ ఎఫ్ 2 స్క్రిప్ట్ విషయంలో అనీల్ రావిపూడి సలహాలు మరియు సూచనలు ఇస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అవేవి నిజం కాదంటూ దర్శకుడు అనీల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు.

హిందీ ఎఫ్ 2 కు సంబంధించిన ఎలాంటి విధులను తాను నిర్వర్తించడం లేదు అంటూ అనీల్ రావిపూడి ప్రకటించాడు. ప్రస్తుతానికి ఆయన పూర్తి దృష్టి ఎఫ్ 3 స్క్రిప్ట్ పైనే ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మరోసారి కమర్షియల్ దర్శకుడిగా పేరు దక్కించుకున్న అనీల్ రావిపూడి ఎఫ్ 3 చిత్రంతో సంక్రాంతికి సక్సెస్ కొట్టాలని చాలా పట్టుదలతో ఉన్నాడు.

ఎఫ్ 3 చిత్రం స్టోరీ లైన్ సిద్దం అయ్యిందని.. హీరోలుగా వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరితో పాటు మరో హీరో కూడా నటించే అవకాశాలు ఉన్నాయంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఎఫ్ 2 చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన దర్శకుడు అనీల్ రావిపూడి ఎఫ్ 3 చిత్రాన్ని ఎఫ్ 2 కు సీక్వెల్ గా రూపొందించబోతున్నాడట.
Please Read Disclaimer