సీన్ పేపర్ తో అనిల్.. శ్రద్దగా మహేష్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వరస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు. దూకుడు తరహాలో పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే క్యూరియాసిటీ నెలకొంది. ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తుండడం కూడా సినిమాపై బజ్ ను పెంచుతోంది.

ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ కూడా చకాచకా పూర్తి చేస్తున్నారు అనిల్ రావిపూడి. రీసెంట్ గా షూటింగ్ లొకేషన్ నుంచి ఒక ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోలో అనిల్ సీన్ పేపర్ చేతిలో పెట్టుకుని.. వివరిస్తూ ఉంటే సూపర్ స్టార్ శ్రద్దగా ఒక విద్యార్ధిలాగా ఆయన చెప్పేదాన్ని వింటున్నారు. మహేష్ కు మొదటి నుంచి ‘డైరెక్టర్స్ యాక్టర్’ అని పేరు. ఒకసారి స్క్రిప్ట్ కు పచ్చజెండా ఊపిన తర్వాత డైరెక్టర్ పనిలో జోక్యం చేసుకోరు. సుశిక్షితుడైన సైనికుడిలా డైరెక్టర్ చెప్పేది చేసుకుంటూ పోతారు. ఈ సినిమా విషయంలో కూడా అలానే జరుగుతోందని మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఇక ఎప్పటిలాగే మహేష్ ఈ ఫోటోలో ఎంతో అందంగా ఉన్నారు.

ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ ను కేరళ పొల్లాచిలో ప్లాన్ చేశారని సమాచారం. ఇప్పటికే అక్కడ షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చేశారని.. మరో రెండు రోజుల్లో పొల్లాచి షెడ్యూల్ ప్రారంభిస్తారట. ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 12 న రిలీజ్ కానుంది.
Please Read Disclaimer