మెల్లగా చిరుకే గాలం వేస్తున్నాడుగా..!

0

రచయితగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి పలు హిట్ చిత్రాలకు రచయితగా వ్యవహరించిన అనీల్ రావిపూడి పటాస్ చిత్రంతో దర్శకుడిగా మారి పోయాడు. దర్శకుడి గా వరుసగా సక్సెస్ లు దక్కించుకున్న అనీల్ గత ఏడాది ఎఫ్ 2 తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ దక్కింది. సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని మహేష్ బాబుతో చేసిన అనీల్ రావిపూడి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కి గాలం వేసే విధంగా కామెంట్స్ చేస్తున్నాడు.

సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి ముఖ్య అతిథి గా పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సందర్బంగా దర్శకుడు అనీల్ రావిపూడి పై చిరంజీవి ప్రశంసలు కురిపించాడు. చిరు నోటి నుండి తన గురించి వచ్చిన నాలుగు మాటలను జీవితాంతం గుర్తుంచుకుంటాను అంటూ అనీల్ అన్నాడు. అది నా అదృష్టంగా భావిస్తానన్నాడు. ఒక వేళ చిరంజీవి గారు నాకు కనుక ఛాన్స్ ఇస్తే మరో ఆలోచన లేకుండా ఆయన తో సినిమా చేస్తానన్నాడు.

చిరంజీవి గారు ఓకే చెప్పిన మూడు నెలల్లో ఆయన కోసం స్క్రిప్ట్ ను సిద్దం చేస్తానంటూ ప్రకటించాడు. చిరంజీవి వంటి స్టార్ తో మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ ను తీసేందుకు తన వద్ద స్టోరీ లైన్స్ కూడా ఉన్నాయంటూ పేర్కొన్నాడు. మొత్తానికి మెల్లగా చిరంజీవిని లైన్ లో పెట్టేందుకు అనీల్ గాలం వేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రం సూపర్ హిట్ అయితే చిరంజీవి ఖచ్చితంగా ఆ గాలంకు పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి సరిలేరు నీకెవ్వరు ఫలితం ఏంటీ అనేది మరో మూడు రోజుల్లో క్లారిటీ వచ్చేను.
Please Read Disclaimer