ఈ తడబాట్లుకు తప్పదు భారీ మూల్యం

0

సినిమాలు తీయడం కత్తి మీద సామే.. ఇది ఒప్పుకొని తీరాల్సిన నిజం – ఎందుకంటే ఎంతో కష్టపడి తీసిన సినిమాలును చూసి జనాలు ఏమంటారో ఇండస్ట్రీ లో ఉన్న మేధావులు ఎవ్వరికి తెలీదు. “బొమ్మ దద్దరిలిపోద్ది” అనుకున్న సినిమాలు కూడా ఘోరంగా ప్లాప్ అవ్వచ్చు. మేటర్ ఏం లేదు అని డిసైడ్ అయిన సినిమాలు రికార్డు కలెక్షన్స్ వసూల్ చేయచ్చు. ఈ మేటర్ ఇండస్ట్రీ లో ఎత్తు పల్లాలు చుసిన వారికి చాలా క్లియర్ గా తెలిసిపోతుంది కానీ ఎప్పుడు హిట్లు చూసే వాళ్లకి – జనాలు తాము ఏది తీసిన చూస్తారు అని లో లోపల ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రం తెలియకపోవచ్చు.

సంక్రాంతి కానుకగా మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవరు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడికి కూడా ఇంత వరకు ప్లాప్ లేదు. అనిల్ తీసిన పటాస్ – సుప్రీమ్ – రాజా ది గ్రేట్ – f2 సినిమాలని జనాలు బాగా ఆదరించారు. ఈ సినిమాలన్ని హిట్లు అవ్వడానికి కారణాలు ఏవైనప్పటికీ వీటి ద్వారానే అనిల్ రావిపూడికి మహేష్ బాబు నుంచి పిలుపు రావడం చక చక సరిలేరు నీకెవరు సినిమా రెడీ అవ్వడం జరిగిపోయాయి. ఐతే మహేష్ వంటి సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం – కెరీర్ లో ఇంత వరకు ప్లాపులు లేకపోవడం వంటి అంశాలు అనిల్ లో కాన్ఫిడెన్స్ పెంచాయని తన సన్నిహితుల చెబుతున్నారు. ఈ మాటనే నిజం చేస్తూ అనిల్ సైతం సరిలేరు నీకెవరు ని హిట్ చేయాలనే కసి తో పని చేసాడని తెలుస్తుంది.

ఐతే వర్క్ చేయడం వరకు బాగానే ఉంది కానీ తాను అసలు ప్లాప్ సినిమాలు తీయను అని అనిల్ స్టేట్ మెంట్స్ ఇవ్వడం పై మనోడి పై ఇండస్ట్రీ లో ఇప్పుడు నెగటివ్ ఫీడ్ బ్యాక్ వినిపిస్తుంది. ముఖ్యం గా తన గురువు శ్రీను వైట్ల తో పోల్చడాని అనిల్ తట్టుకోలేకపోతున్నాడట. నిజానికి అనిల్ రావిపూడి తన గురువు శ్రీను వైట్ల మాదిరిగానే సినిమాలు తీస్తున్నాడు. గతం లో శ్రీనువైట్ల కూడా చాలా హిట్లు చాలా ప్లాపులు ఇచ్చాడు. అనవసరమైన పేరడీలు స్పూఫ్ లూ చేసి తనకొచ్చిన పేరుని చెడగొట్టుకున్నాడు. కాదని చెప్పలేం కానీ అనిల్ రావిపూడి కూడా కాస్త అటు ఇటు గానే కామెడీలు మీదే సినిమాలు లాగేస్తున్నాడు. సరిలేరు ట్రైలర్ ని చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. దీనికి తోడుగా ఇప్పుడు బన్నీ సినిమాకి పోటీగా సరిలేరు రావడం – మొన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ ని మర్చిపోవడం వంటి తడబాట్లు అనిల్ రావిపూడిని ప్రస్తుతం టెన్షన్ పెడుతున్నాయి.
Please Read Disclaimer