అప్పుడు మహేష్ ఇప్పుడు అనిల్ రావిపూడి

0

ఈ మధ్య వేదికలపై గుర్తుపెట్టుకొని చెప్పాల్సిన పేరు మర్చిపోవడం ఆ తర్వాత జనాలు గుర్తుచేసాక మళ్ళీ ఓ ట్వీట్ వేయడం కామన్ అయిపొయింది. ఇటివలే ‘మహర్షి’ ఈవెంట్ లో కూడా అందరి గురించి చెప్పి తనకి ‘పోకిరి’తో మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన పూరి గురించి మర్చిపోయాడు మహేష్. అయితే మహేష్ మర్చిపోయాడో చెప్పడం ఇష్టం లేదో కానీ సోషల్ మీడియాలో మాత్రం మహేష్ ని ట్యాగ్ చేస్తూ పూరి ని ఎలా మర్చిపోయావ్ అంటూ నిలదీశారు.

మళ్ళీ వెంటనే తన టీం ద్వారా విషయం తెలుసుకొని స్పెషల్ గా పూరి గురించి ఓ ట్వీట్ వేసాడు సూపర్ స్టార్. అయితే నిన్న జరిగిన ఈవెంట్ లో మెగా స్టార్ సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుతుండగా అనిల్ రావిపూడి వెనక నుండి ‘దర్బార్’ సినిమాను గుర్తుచేసాడు. వెంటనే చిరు దర్బార్ కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా అంటూ స్పీచ్ క్లోజ్ చేసాడు.

అయితే సంక్రాంతి రోజు రిలీజవుతున్న కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ సినిమాను మెగా స్టార్ మర్చిపోవడం కనీసం అనిల్ రావిపూడి అయిన దర్బార్ తర్వాత చెప్పకపోవడం నందమూరి ఫ్యాన్స్ హర్ట్ చేసింది. ఇక నిన్న ఈవెంట్ అవ్వగానే అనిల్ ని టార్గెట్ చేసి నీకు మొదటి సినిమా ఇచ్చిన కళ్యాణ్ రామ్ ను సినిమాను ఎలా మర్చిపోయావ్ అంటూ ట్రోల్స్ చేసారు. ఇక రాత్రి తను చేసిన మిస్టేక్ తెల్సుకొని ఉదయాన్నే తనకి మొదటి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ ను ట్యాగ్ చేస్తూ నిన్న మర్చిపోయినందుకు సారీ చెప్తూ ‘ఎంత మంచి వాడవురా’ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేసాడు. దీంతో నందమూరి ఆగ్రహం కొంత వరకూ తగ్గింది.
Please Read Disclaimer