అంతన్నాడింతన్నాడే రావిపూడి..

0

తన సినిమాలు మేకింగ్ దశలో ఉండగానే అందులోని హైలైట్ల గురించి ఓపెన్ అయిపోతుండటాడు దర్శకుడు అనిల్ రావిపూడి. వాటి గురించి ముందే ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేయడం అంచనాలు పెంచడం అతడికి అలవాటు. సుప్రీమ్ రాజా ది గ్రేట్ ఎఫ్-2 సినిమాల విషయంలో ఇదే స్ట్రాటజీ అనుసరించాడు. ఆ సినిమాల్లో కామెడీ ట్రాక్లు అతను చెప్పిన స్థాయిలోనే ఉండటంతో ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యారు. ఆ సినిమాలు పెద్ద హిట్టయ్యాయి కూడా. దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’ విషయంలోనూ ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యాడు. ఇందులో ట్రైన్ ఎపిసోడ్ గురించి ముందు నుంచి ఊదరగొడుతూనే ఉన్నాడు. ‘వెంకీ’ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ తర్వాత ఆ స్థాయిలో ఇది పేలబోతోందనే సంకేతాలిచ్చాడు. దీని మేకింగ్ టైంలో కూడా తెగ అప్ డేట్స్ ఇస్తూ అంచనాలు పెంచుకుంటూ పోయాడు అనిల్. కానీ తీరా తెర మీద బొమ్మ చూస్తే మాత్రం దీనికంత సీన్ లేదని అర్థమైపోయింది.

‘సరిలేరు..’లో కాస్త హై ఇచ్చే హీరో ఇంట్రో ఎపిసోడ్ల తర్వాత వస్తుంది ట్రైన్ ఎపిసోడ్. ఇక వినోదాల వల్లరే అనుకుంటే.. అది చాలా సాధారణంగా సాగుతుంది. హీరోయిన్ ఆమె తల్లిదండ్రులు అక్కలు చేసే హడావుడి మీద కామెడీని పండించాలని చూశాడు అనిల్. కానీ ఆ పాత్రలు చాలా అసహజంగా ఉండటం.. చీప్గా బిహేవ్ చేయడంతో ప్రేక్షకులు నవ్వుకోకపోగా.. ఆ సీన్లు నవ్వుల పాలయ్యాయి. బండ్ల గణేష్ వచ్చాడు ఇంకైనా కామెడీ పండుతుందేమో అనుకుంటే అతడితో ముడిపడ్డ సీన్లు కూడా తేలిపోయాయి. అనిల్ కామెడీ టచ్ కోల్పోయాడా.. అతడివి ఆరంభ మెరుపులేనా అనిపించేలా సాగింది ఈ ట్రైన్ ఎపిసోడ్. ముందు ఈ ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా అనుకున్న ప్రేక్షకులు.. ఇదెప్పుడు అయిపోతుందా అని ఫీలయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ద్వితీయార్ధంలో వెన్నెల కిషోర్ సుబ్బరాజుల పాత్రల్ని ప్రవేశపెట్టి నవ్వించేందుకు అనిల్ చేసిన ప్రయత్నమూ బెడిసికొట్టేసింది. కేవలం మహేష్ చరిష్మా మీద మాత్రమే ఈ సినిమా ఆడాలి తప్ప కాదు.. అనిల్ కామెడీ వల్లయితే కాదు.
Please Read Disclaimer