జంధ్యాల కామెడీతో నీ కామెడీకి పోలికనా?

0

పటాస్ చిత్రంతో దర్శకుడిగా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన అనీల్ రావిపూడి ఆతర్వాత వరుసగా సుప్రీమ్.. రాజా ది గ్రేట్.. ఎఫ్ 2 వంటి చిత్రాలతో కమర్షియల్ సక్సెస్ లు దక్కించుకున్నాడు. ఈయన సినిమాలు కమర్షియల్ ఎంటర్ టైనర్స్ గా పేరు దక్కించుకుంటున్నాయి. ముఖ్యంగా ఎఫ్ 2 చిత్రం కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈయన తదుపరి చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ సందర్బంగా అనీల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమాలో కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా కామెడీకి జంధ్యాల గారు ప్రేరణ. ఒక విధంగా చెప్పాలి అంటే నేను ఆయన ఏకలవ్య శిష్యుడిని అంటూ అనీల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. జంధ్యాల గారి కామెడీ సీన్స్ ను చూసి ఇన్సిపైర్ అయ్యి నేను నా సినిమాల్లో కామెడీ సీన్స్ పెడుతున్నాను అంటూ అనీల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలను నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

జంధ్యాల గారి కామెడీతో నీ సినిమాల కామెడీని పోల్చుకోవడం ఏంటీ.. ఆయన ఏకలవ్య శిష్యుడను అంటూ చెప్పుకోవడం ఏంటీ. నీ కామెడీకి జంధ్యాల గారి కామెడీకి అసలు ఏమైనా సంబంధం ఉందా. నీ సినిమాలో ఉండేది అంతా కూడా డబుల్ మీనింగ్ డైలాగ్ కామెడీ. అలాంటి నీ కామెడీని జంధ్యాల గారి కామెడీతో పోల్చుకోవడం నీ అవివేకం అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. జంధ్యాల గారి కామెడీ స్థాయిలో కనీసం పది శాతం కూడా నీ కామెడీ ఉండదంటూ సోషల్ మీడియాలో అనీల్ రావిపూడిని ఉద్దేశించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అనీల్ రావిపూడి తనకు తానే ట్రోలర్స్ బారిన పడ్డట్లయ్యింది.
Please Read Disclaimer