మహేష్ డైరెక్టర్ బన్నీ సినిమాపై సెటైర్ వేశాడా?

0

సంక్రాంతి సినిమాలు వేటికి అవి ప్రమోషన్స్ లో మంచి జోరు మీద ఉన్నాయి. అయితే వీటిలో బన్నీ సినిమా ‘అల వైకుంఠపురములో’ కాస్త స్పీడ్ గా ఉంది. ఇప్పటికే రెండు సాంగ్స్ తో మిలియన్స్ వ్యూస్ సాదిస్తూ రికార్డులు నెలకొల్పుతూ వెళ్తున్నాడు బన్నీ. ఒక వైపు మహేష్ కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ పోస్టర్స్ తో హంగామా చేస్తున్నాడు.

అయితే మూడు నెలల ముందే సినిమాలో బెస్ట్ సాంగ్ ఒకటి బయటికి వదిలేసి అందరికీ షాక్ ఇచ్చాడు బన్నీ. అయితే మహేష్ సినిమా సెట్ లో ఇది హాట్ టాపిక్ గా మారిందట. సంక్రాంతికి ఒకే రోజు పోటీ పడుతున్న ఈ సినిమా మధ్య మంచి పోటీ ఉంది. అందుకే రెండు సినిమాల గురించి ఎప్పటికప్పుడు ఆయా దర్శక నిర్మాతలు గుసగుసలాడుకుంటున్నారట.

ఇక లేటెస్ట్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా స్టోరీ లీక్ మీద సుబ్బరాజు -వెన్నెల కిషోర్ లతో షూట్ చేసి ఓ వీడియో బయటికి వదిలారు ‘సరిలేరు’ టీం. ఇందులో దర్శకుడు అనీల్ రావిపూడి కూడా కనిపించి లీకులపై సరదాగా రియాక్ట్ అయి మన సినిమా సంక్రాంతికి ఇప్పుడే ప్రమోషన్స్ ఎందుకు అన్నట్టుగా ఓ డైలాగ్ వదిలాడు. ఈ డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అనీల్ ఈ డైలాగ్ వాడింది బన్నీ సినిమా గురించేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. మరి ఆ డైలాగ్ ఎందుకో అసలు ఉన్న పళంగా ఈ వీడియో ఎందుకు వదిలాడో మహేష్ దర్శకుడికే తెలియాలి.
Please Read Disclaimer