16 ఏళ్ళ మహేష్ జ్ఞాపకం

0

ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో స్పెషల్ గా భావించే ఒక్కడు సినిమా వచ్చి 16 ఏళ్ళు దాటినా ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి అలా కట్టిపడేసేలా చేయడం దాని ప్రత్యేకత. ముఖ్యంగా ఓబుల్ రెడ్డి పాత్రధారి ప్రకాష్ రాజ్ ని కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర మహేష్ లాగిపెట్టి కొట్టే సీన్ ని ఎన్నిసార్లు చూసినా గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. అంత స్పెషల్ మెమరీని మరోసారి గుర్తుచేసుకునేలా అనిల్ రావిపూడి పోస్ట్ చేసిన ఒక పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

జనవరిలో విడుదల కానున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీలో దీని కోసమే కొండారెడ్డి బురుజు సెట్ ని ఏఎస్ ప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేకంగా వేశారు. నైట్ మోడ్ లో మహేష్ బాబు దాని చూస్తూ నిలబడగా వెనుక నుంచి తీసిన ఓ స్పెషల్ పిక్ ని దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ కీలకమైన షెడ్యూల్ లోనే విజయశాంతితో పాటు హీరొయిన్ రష్మిక మందన్న ఇతర కీలక తారాగణం పాల్గొంటున్నారు. ఇంకా పాటల చిత్రీకరణ మొదలుపెట్టాల్సి ఉంది. భరత్ అనే నేను -మహర్షి తర్వాత హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మూవీగా అభిమానులు దీని మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. సంక్రాంతి రేస్ లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.
Please Read Disclaimer