చిరంజీవి.. ఎన్టీఆర్ ఛాన్సిస్తారా?

0

రొటీన్ కథల్ని కూడా కమర్షియల్ హిట్లుగా మలిచే స్కిల్ కొందరికే ఉంటుంది. అయితే రొటీన్ గా కాకుండా.. వైవిధ్యం ఉన్న కథల్ని ఎంచుకుని సత్తా చాటే దర్శకులకు ఉండే గుర్తింపు వేరు. ఇటీవల వరుస హిట్లు అందుకున్నా అనీల్ రావిపూడిపై రకరకాల కామెంట్లు వినిపించాయి. 2019 సంక్రాంతికి ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ అందుకుని 2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు రూపంలో సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు రొటీన్ కథలతో తెరకెక్కినవే. కామెడీని ఎగ్జిక్యూట్ చేయడంలో తనదైన శైలితో ఎంటర్ టైన్ చేసినా రొటీన్ ఫ్లేవర్ రిపీటవుతోందన్న విమర్శ కూడా వినిపించింది. ఇక సంక్రాంతి సీజన్ అతడికి ఒక రకంగా పెద్ద ప్లస్ అయ్యిందన్న విశ్లేషణ సాగింది.

రవితేజ – మహేష్ లాంటి స్టార్లతో సినిమాలు చేసిన కాన్ఫిడెన్స్ తో ఎన్టీఆర్ … చిరంజీవి లాంటి టాప్ స్టార్లకు స్క్రిప్టు వినిపించే పనిలో ఉన్నాడని ప్రచారమవుతోంది. అయితే ఆ ఇద్దరూ వెంటనే అవకాశాలిచ్చేస్తారా? అంటే.. అనీల్ రావిపూడి బలాబలాల్ని అభిమానులు విశ్లేషిస్తున్నారు. పటాస్ – రాజా ది గ్రేట్- ఎఫ్ 2 లాంటి చిత్రాల్లో కొన్ని అసహజమైన లాజిక్ లేని సన్నివేశాలు ఎంచుకున్నా.. తనదైన మార్క్ కామెడీతో మెప్పించగలిగాడు.కొన్ని లోటుపాట్లు ఉన్నా జనం వాటిని పట్టించుకోలేదు అప్పటికి. కానీ సరిలేరు నీకెవ్వరు చిత్రం విషయంలో ఆ మ్యాజిక్ రిపీటవ్వలేదు. కాస్త ఎఫ్ 2 తరహా కామెడీని రిపీట్ చేశాడన్న విమర్శలూ ఎదురయ్యాయి. అలాగే సెకండాఫ్ పరంగా అనీల్ రావిపూడి వీక్ నెస్ బయటపడిందని కొందరు క్రిటిక్స్ విశ్లేషించారు.

అలాంటి కొన్ని మైనస్ లు ఉన్నప్పుడు.. చిరంజీవి స్థాయి పెద్ద హీరోని హ్యాండిల్ చేయగలడా? సరిలేరు విషయంలోనే తప్పటడుగు వేసాడు కదా! అంటూ లాజిక్ ని వెతుకుతున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ ట్రీట్ మెంట్ పరంగా అనీల్ మరింత స్ట్రాంగ్ అవ్వాల్సిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక తారక్.. చిరు అంత పెద్ద స్టార్లతో సినిమాలు చేయాలని కలలు కననిది ఎవరు? ఆ రేంజ్ హీరోల్ని డీల్ చేయాలంటే చాలానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మారిన ట్రెండ్ లో కొత్త పంథా కథల్ని ఎంచుకుని అందులో కామెడీ ట్రీట్ ని ఇవ్వాల్సి ఉంటుంది. కథల్లో ఇన్నోవేషన్ .. సీన్స్ లో రినోవేషన్ తప్పనిసరి. నేల విడిచి సాము చేయకుండానే ఇదంతా రాబట్టాలి. అలా కాకుండా శ్రీనువైట్ల తీరుగా రొటీన్ గా చేస్తే అనీల్ కి అది పెద్ద మైనస్ అయ్యి తీరుతుందని విశ్లేషిస్తున్నారు. లోటుపాట్లు సరిదిద్దుకుని అనీల్ జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కామెడీ సినిమాలు తీసే దర్శకులంతా ఫేడవుట్ అయిన నేపథ్యంలో అనీల్ కి అన్నీ కలిసొస్తున్నాయి. సక్సెస్ ని మరో లెవల్ కి తీసుకెళ్లాలంటే తప్పుల్ని గుర్తించి సరిదిద్దుకుంటే మరింత షైన్ అవుతాడనేది విమర్శకుల సూచన. మరి దీనిని అనుసరిస్తాడా లేదా? అన్నది చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-