వారిద్దరి కాంబినేషనే పెద్ద సెల్లింగ్ ఫ్యాక్టర్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ పాత్ర కోసం పట్టుబట్టి మరీ ఒప్పించడంతో 13 ఏళ్ళ తర్వాత విజయశాంతి కెమెరా ముందుకు వచ్చారు. ఈ సినిమాలో విజయశాంతి నటనకు ప్రేక్షకుల ఫిదా అవుతారని నిర్మాత అనిల్ సుంకర అంటున్నారు.

‘సరిలేరు నీకెవ్వరు’ గురించి అనిల్ సుంకర మాట్లాడుతూ విజయశాంతి గారు ఈ సినిమాలో అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పారు. మహేష్ – విజయశాంతి కాంబినేషన్లో వచ్చే సీన్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటాయని.. నిజానికి వారి కాంబినేషనే ఈ సినిమాకు పెద్ద సెల్లింగ్ ఫ్యాక్టర్ అని అనిల్ సుంకర చెప్పారు. మహేష్ – విజయశాంతి కాంబినేషన్లో వచ్చే సీన్లకు విజిల్స్.. క్లాప్స్ పడుతూనే ఉంటాయి. అవి లేనప్పుడు కన్నీరు పెడతారు అంటూ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్ లో విజయశాంతికి ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే. టీజర్ లో కూడా విజయశాంతికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అనిల్ సుంకర మాటలను బట్టి చూస్తుంటే మహేష్ – విజయశాంతి కాంబినేషన్ సీన్లపై మరింత ఆసక్తి పెరగడం ఖాయం.

‘సరిలేరు నీకెవ్వరు’ లో మహేష్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ప్రకాష్ రాజ్.. సత్యదేవ్.. నరేష్.. రాజేంద్ర ప్రసాద్.. సంగీత.. హరితేజ.. వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
Please Read Disclaimer