భర్తతో కలిసి బోల్డ్ గా..!

0

ఈ జెనరేషన్ యూత్ కు సీనియర్ హీరోయిన్ అనిత హసనందాని పేరు తెలిసి ఉండకపోవచ్చు కానీ ఓ పదిహేనేళ్ల క్రితం ఈ భామ రెండు మూడు సూపర్ హిట్లలో నటించి క్రేజీ హీరోయిన్ గా ఉండేది. ఉదయ్ కిరణ్ సూపర్ హిట్ ఫిలిం ‘నువ్వు నేను’ (2001) ఈ భామ హీరోయిన్. ప్రస్తుతం హిందీ సీరియల్స్ లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్త ను 2013 లో వివాహం చేసుకుని పర్సనల్ లైఫ్ లో కూడా సెటిల్ అయింది. అయితే ఇవన్నీ ఇలా ఉన్నా సోషల్ మీడియాలో మంటలు పెట్టడం మాత్రం మానలేదు.

ఈ భామ వయసు తక్కువేమీ కాదు.. ఇప్పుడు 38. అయినా స్లిమ్ గా మెయింటెయిన్ చేస్తూ ఇరవై ఏళ్ల వారికి అసూయ పుట్టేలా చేస్తుంది. రీసెంట్ గా ఈ భామ తన భర్త రోహిత్ రెడ్డి తో ఒక హాట్ ఫోటో షూట్ చేసింది. ఒక ఫోటోలో అయనగారి ఒడిలో కూర్చుని ఇక లిప్పులు లాక్ చెయ్యడమే ఆలస్యం అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. మరో ఫోటోలో భర్తగారి భుజంపై చెయ్యి వేసి కళ్లు మూసుకొని తన్మయత్వంలో ఉంది. ఈ ఫోటోలో ఇద్దరూ ఒకే రకమైన దుస్తులు ధరించి మ్యాచింగ్.. మ్యాచింగ్ అన్నట్టుగా ఉన్నారు.

ఈ ఫోటోలకు రెస్పాన్స్ అదిరిపోయింది. “జోడి నంబర్ 1”.. “మీరు ట్విన్నింగ్.. ఇక్కడ బర్నింగ్” అంటూ కామెంట్లు పెట్టారు. వర్క్ విషయానికివ్ వస్తే అనిత ప్రస్తుతం కొన్ని సీరియల్స్ లో నటిస్తోంది. ఈ ఏడాది నచ్ బలియే 9 లో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది.
Please Read Disclaimer