డిప్రెషన్ లో మాస్ రాజా హీరోయిన్?

0

మాస్ మహారాజా రవితేజ హీరోయిన్ కు ఇంతకీ ఏమైంది? రెండేళ్లుగా అసలు ఐపు అన్నదే లేకుండా పోయింది. ఎందుకింత ఒత్తిడికి గురవుతోంది? ఇటీవల ఎందుకని సినిమాలు చేయడం లేదు. కెమెరా ముందుకు రాదేం? ఇదంతా ఎవరి గురించి అంటే..

మాస్ మహారాజా రవితేజ తొమ్మిదేళ్ల క్రితం నటించిన మాస్ మసాలా ఎంటర్ టైనర్ `డాన్ శీను` చిత్రంలో నటించింది అంజనా సుఖానీ. పరిచయమైంది వడ్డే నవీన్- సంగీత నటించిన `నా ఊపిరి` సినిమాతోనే అయినా గుర్తింపు తెచ్చింది మాత్రం రవితేజ నటించిన `డాన్శీను`. అయితే ఆ తరువాత మాత్రం తెలుగులో అవకాశాల్ని పొందలేకపోయింది. 2005లోతిరిగి బాలీవుడ్ కి వెళ్లిన అంజన అల్లాబాందే- డిపార్ట్మెంట్- మాగ్జిమమ్- సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్స్టర్ రిటర్న్ వంటి చిత్రాల్లో నటించింది. సడెన్గా 2017 నుంచి సినిమాలకు దూరమైపోయింది.

అందుకు కారణమేంటి? అన్నది మాత్రం ఇన్నాళ్లు ఎవరికీ తెలీదు. ఇటీవలే ఓ బాలీవుడ్ మీడియాని కలిసిన ఈ బ్యూటీ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. `మా ఆంటీ క్యాన్సర్ బారినపడ్డారు. ఆమెకు వివాహం కాకపోవడంతో నేనే అండగా ఉన్నాను. తనకు కీమో థెరపి జరిగిన సందర్భంలో నా బాధ వర్ణనాతీతం. తను చికిత్స తరువాత చనిపోయారు. ఈ బాధతోనే ఓ ఏడాది గడిచిపోయింది. నా జీవితంలో చాలా మార్పులు మొదలయ్యాయి. ఆ తరువాత నన్నెంతగానో ప్రేమించే మా గ్రాండ్ మదర్ చనిపోయింది. దీంతో చాలా డిప్రెషన్ కు గురయ్యాను. దాని కారణంగానే సినిమాలకు దూరమయ్యాను“ అని చెప్పుకొచ్చింది అంజనా సుఖానీ.
Please Read Disclaimer