కొణిదెల ఇంట `అన్నప్రాసాన` వేడుక

0

కొణిదెల ఇంట `అన్నప్రాసాన` వేడుక టాక్ ఆఫ్ ది టౌన్. మెగాస్టార్ చిరంజీవి మనవరాలు .. కళ్యాణ్ దేవ్- శ్రీజ జంట కుమార్తె బేబి నవిష్క అన్న ప్రాసాన వేడుక కొద్దిరోజుల క్రితం ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుక ఆద్యంతం బేబి నవిష్క పట్టు పరికిణీలో చాలా ముద్దుముద్దుగా కనిపించి ఆకట్టుకుంది. చిన్నారి చిరునవ్వులు ఆ ఇంట వెలుతురును నింపాయి. ఈ వేడుకలో తాత – అమ్మమ్మల ముద్దు మురిపం ఆకర్షించింది. మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులు ఈ స్పెషల్ డే ఎంతో సంతోషంగా కనిపించారు. మనవరాలికి తొలి గోరు ముద్దను తినిపించారు. తాజాగా ఆ వీడియోని మెగా ఫ్యామిలీ రిలీజ్ చేసింది.

శ్రీజ – కళ్యాణ్ దేవ్ జంట ఈ వేడుకలో ప్రతి మూవ్ మెంట్ ని ఎంతో ఆస్వాధిస్తూ కనిపించారు. ఇక ఈ అన్నప్రాసాన కార్యక్రమంలో ఉంచిన కొన్ని వస్తువుల నుంచి భగవద్గీతను పట్టుకుని బేబి నవిష్క అందరికీ షాకిచ్చింది. ఈ వేడుక అత్యంత ప్రయివేటుగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.. తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సందడి వేడుక ఆద్యంతం ప్రత్యేకంగా హైలైట్ అయ్యింది.

ఈ వేడుకలో కొందరు ముఖ్యులు మిస్సయ్యారని వీడియో చూస్తే అర్థమవుతోంది. మెగా హీరోలు పవన్ కల్యాణ్- రామ్ చరణ్- అల్లు అర్జున్ ఈవెంట్ లో మిస్సయ్యారు.. అలాగే అల్లు ఫ్యామిలీ ఈ వేడుకకు హాజరు కాలేదని అర్థమవుతోంది. అయితే ఎవరికి వారు బిజీబిజీగా రకరకాల షెడ్యూల్స్ లో ఉండడం వల్లనే రాలేకపోయారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ వేడుకలో చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ తల్లిదండ్రులు.. వారి బంధుమిత్రులు ఉన్నారు. మెగా బ్రదర్ నాగబాబు- పద్మజ దంపతులు.. నిహారిక.. శ్రీజ పెద్ద కుమార్తె.. శ్రీజ సోదరి సుశ్మిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Please Read Disclaimer