అభిమానంతో ముద్దు పెడితే మీటూనా?

0

గత ఏడాది వరకు కేవలం విదేశాలకు.. హాలీవుడ్ కే పరిమితం అయిన మీటూ ఉద్యమం తనూశ్రీ దత్తా ఒక నటుడిపై చేసిన లైంగిక వేదింపుల ఆరోపణలతో ఇండియాలో కూడా గత సంవత్సరం మీటూ ఉద్యమం ప్రారంభం అయ్యింది. మీటూ ఉద్యమం తర్వాత ఇండియాలో చాలా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లైంగిక వేదింపులు తగ్గడంతో పాటు గతంతో పోల్చితే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ తగ్గిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అంతా బాగానే ఉంది కాని తనూశ్రీ దత్తాతో పాటు కొంత మంది మీటూ ఉద్యమం పేరుతో చిన్న విషయాలను పెద్దగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల ఇండియన్ ఐడియల్ పోటీదారుడు ప్రముఖ సింగర్ నేహా కక్కర్ ను స్టేజ్ పై బలవంతంగా ముద్దు పెట్టుకున్న విషయం తెల్సిందే. ఆ విషయం బాగా వైరల్ అయ్యింది. అయతే అతడు కేవలం ఆమెపై ఉన్న అభిమానంతోనే ముద్దు పెట్టుకున్నాడని అంతుకు మించి ఏం లేదంటూ షో నిర్వాహకులు చెప్పారు. అలాగే నేహా కూడా ఆ విషయాన్ని చాలా లైట్ తీసుకుని వదిలేసినట్లుగా పేర్కొంది.

కాని ఇప్పుడు తనూశ్రీ దత్తా మీటూ ఉద్యమంలో నేహా కక్కర్ భాగస్వామి అయ్యి అతడిపై చట్టపరమైన చర్యలకు సిద్దం అవ్వాలంటూ సూచిస్తుంది. తనూశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. అభిమానంతో ముద్దు పెట్టుకుంటే ఆమె సరే అనుకుంది. మరి మద్యలో నువ్వు ఎందుకు మీటూ అంటూ ముందుకు వస్తున్నావు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మీటూ ఉద్యమంకు ఉన్న గౌరవాన్ని కాపాడాలని.. ఇష్టానుసారంగా మీటూ అనడం కరెక్ట్ కాదంటూ ఆమెకు హితవు పలుకుతున్నారు. ఇప్పటికే ఆమె మొదట్లో చేసిన ఆరోపణలు నిరాదారమైనవి అంటూ కోర్టు కొట్టి పారేసింది.
Please Read Disclaimer