తన లెవెల్ తగ్గిందా.. అన్పిస్తున్న రమ్యకృష్ణ

0

రమ్యకృష్ణ. ఈ పేరు వింటే 90ల నాటి అభిమానులకు ఆరాధ్య దేవతగా గుర్తొస్తుంది. కానీ ఈ జనరేషన్ వారికి తల్లిగా అత్తగా మాత్రమే తెలుసు. కానీ ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన రమ్యకృష్ణ అనంతరం రజినీకాంత్ నరసింహ సినిమాలో విలన్ గా కూడా మెప్పించిన విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత అంతా పవర్ ఫుల్ పాత్రలు తగలలేదనే చెప్పాలి. అరకొర పాత్రలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు.

చాలా గ్యాప్ తర్వాత బాహుబలిలో శివగామిగా ప్రత్యక్షమైంది. శివగామి పాత్రలోని ఠీవి రాజసంతో డైలాగ్ డెలివరీతో అదరహో అనిపించుకుంది. రమ్యకృష్ణ ఇస్ బ్యాక్ అన్నట్లుగా పేరుపొందింది. కానీ అంతా పవర్ ఫుల్ పాత్రలో నటించిన అనంతరం ఎంత పెద్ద సినిమా చేసినా రమ్యకృష్ణ అభిమానులకు చిన్నదిగానే అన్పిస్తుంది. మరి ఇప్పుడు తాజాగా భర్త కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమాలో నటిస్తూ మరో సినిమాకు సైన్ చేసిందని సమాచారం. అదే సాయి ధరమ్ తేజ్- దేవాకట్టాల కాంబినేషన్ సినిమా.

మరి ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ రమ్యకృష్ణకు తగిన పాత్రలేనా.. రానున్న సినిమాలు రమ్యకృష్ణ రేంజ్ ని పెంచేలా ఉండబోతున్నాయా.. అనే విషయాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని ఊరికే అనలేదు మరి. అన్ని పాత్రలు బాహుబలిలా ఉండాలన్న ఇదేంలేదు. కానీ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలైతే ఒప్పుకుంటుంది అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-