యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

బాలయ్య పేరిట మరో అరుదైన రికార్డ్.. ఇండియాలోనే నెంబర్ వన్ హీరో..

0

Another Record In Ballayya Name: నట సింహం నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. బాలయ్య స్వభావం లాగే, ఆయన పర్సనల్ లైఫ్, అలాగే ఆయన సినీ కెరీర్ అంతా ఓపెన్ బుకే. బాలయ్యను దూరం నుంచి చూసిన వాళ్ళు, ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం అంటారు. దగ్గర నుంచి చూసిన వాళ్ళు, ఆయన మనసు స్వచ్ఛమైన వెన్న లాంటిది అంటారు. అయితే, రికార్డులును బ్రేక్ చేయడంలో బాలయ్య తర్వాతే ఎవరైనా.

అసలు ఆయన సినిమాలు సాధించిన రికార్డుల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. నటసింహం బాలకృష్ణ అఖండ మూవీతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాడు. అఖండ విజయం సాధించిన నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ పండుగ జరుపుకున్నారు. అఖండ థియేటర్స్ వద్ద కోలాహలం నెలకొంది. కరోనా పరిస్థితుల తర్వాత థియేటర్స్ వద్ద ఈ స్థాయిలో జనాలను చూడలేదు.

బాలయ్య-బోయపాటి మూవీ కోసం సినిమా ప్రియులు, ఫ్యాన్స్ థియేటర్స్ కి పోటెత్తారు. ఈ రోజుల్లో ఒక సినిమా మూడు వారాలు ఆడిందంటే అది చరిత్ర. అలాంటిది బాలయ్య ‘అఖండ’ ఏకంగా 175 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించారు ఇది కూడా రికార్డు అని చెప్పాలి.