హైదరాబాద్ లో మరో సెక్స్ రాకెట్ .. హీరోయిన్ తో పాటు .. ?

0

హైదరాబాద్ మహానగరం… వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ కూడా ఒకటి. ఐటీ రంగం పరంగా హైదరాబాద్ ముంబై బెంగుళూరు వంటి నగరాలతో పోటీపడుతూ అగ్రస్థానం కోసం పోటీపడుతోంది. ఐటీ రంగంలో హైదరాబాద్ టాప్ పొజిషన్ లో ఉండటంతో ఇక్కడికి దేశం నలుమూలల నుండి ఎంతోమంది యువత వచ్చి ..ఉద్యోగాలు చేస్తుంటారు. ఆలా ఉద్యోగ కల్పన ..ఆదాయం పరంగా హైదరాబాద్ టాప్ లో ఉంది. అలాగే వాటికీ తోడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది.

బేగంపేటలోని లిస్బన్ పబ్లో వ్యభిచార దందా గుట్టురట్టు చేసి సరిగ్గా 24 గంటలు గడవకముందే మరో హైటెక్ సెక్స్ రాకెట్ బయటపడింది. బంజారాహిల్స్లోని ఓ ప్రముఖ హోటల్ లో బాలీవుడ్ హీరోయిన్ తో వ్యభిచారం చేయిస్తుండగా పోలీసులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనలో సినీనటితో పాటు సీరియల్ నటిని రక్షించి ఇద్దరిని అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాలు చూస్తే .. ముంబయికి చెందిన బాలీవుడ్ సెకండ్ గ్రేడ్ హీరోయిన్ తో పాటు ఓ సీరియల్ నటితో బంజారాహిల్స్లోని హోటల్ లో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు గురువారం ఆ హోటల్ పై రైడ్ చేశారు. హీరోయిన్ తో పాటు కాస్టింగ్ డైరెక్టర్ ఈవెంట్ మేనేజర్ ను కూడా అరెస్ట్ చేశారు. హోటళ్లలో ఈవెంట్ పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి పలువురు హీరోయిన్లు మోడల్స్ ని రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గతంలోనూ బంజారాహిల్స్లో భోజ్పురి హిందీతో పాటు తెలుగు సినిమాలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి హీరోయిన్లతో వ్యభిచారం చేయిస్తూ దొరికిన ఘటనలు ఉన్నాయి. దీనితో పోలీసులు హోటల్స్ పై మరింత నిఘా ఉంచారు. సెక్స్ రాకెట్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తుండటంతో .. వారిని పట్టుకోవడం కష్టతరంగా మారుతుంది.




Please Read Disclaimer