బాలీవుడ్ ప్రేక్షకుల కోసం ‘జాన్’ లో మరో స్టార్

0

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ చిత్రం షూటింగ్ ను సాగతీస్తూనే ఉన్నారు. ప్రభాస్ గత చిత్రాలు బాహుబలి.. సాహో ల మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా తీస్తూనే ఉన్నారు. ఇంకా కూడా ఈ సినిమా కోసం మరో నటుడిని తీసుకున్నారు అంటే షూటింగ్ ఏ రేంజ్ లో మెల్లగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకా సినిమా టైటిల్ ను కూడా ఖరారు చేయలేదు. జాన్ అంటూ నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఓ డియర్ లేదంటే రాధేశ్యామ్ అనే టైటిల్ ను ఖరారు చేస్తారని వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రాన్ని కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ఇందులో బాలీవుడ్ స్టార్స్ ను జొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ నటీనటులు కనిపించబోతున్నారు. ఈ సమయంలోనే ఒకప్పటి బాలీవుడ్ స్టార్ అయిన మిథున్ చక్రవర్తిని ఈ చిత్రంలోని కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.

బాలీవుడ్ ప్రేక్షకుల్లో మిథున్ అంటే క్రేజ్ ఉంది. అందుకే ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి ఉంటే అక్కడ ఈ చిత్రం గురించి చర్చ జరుగుతుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. షూటింగ్ చివరి దశకు వచ్చిందంటూ ఆమద్య వార్తలు వచ్చాయి. ఈ దశలో ఆయన్ను తీసుకున్నారు అంటే ఆయన పాత్ర నిడివి చాలా తక్కువే ఉండి ఉండవచ్చు అంటున్నారు. అయినా కూడా మిథున్ చక్రవర్తి సినిమాలో ఉన్నాడు అంటే ఆ క్రేజ్ వేరు. బాలీవుడ్ లో మిథున్ పేరు వల్ల మంచి బిజినెస్ కూడా అయ్యే అవకాశం ఉందనేది మేకర్స్ ప్లాన్ గా తెలుస్తోంది.
Please Read Disclaimer