బన్నీ ఫ్యాన్స్ మళ్లీ పండుగకు రెడీ అవ్వండి

0

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురంలో’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ను రెండు నెలల క్రితమే సంగీత దర్శకుడు థమన్ మొదలు పెట్టాడు. సామజవరగమనా అంటూ పాటను విడుదల చేసి సెన్షేషన్ క్రియేట్ చేశాడు. యూట్యూబ్ లో ఆ పాట సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అదే జోష్ తో దీపావళి కానుక అంటూ రాములో రామల పాట వచ్చింది. మరోసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ పాటను ఆకాశం అంత ఎత్తుకు తీసుకు వెళ్లారు. భారీ వ్యూస్ లైక్స్ తో ఆ పాట కూడా దుమ్ము దుమ్ముగా సక్సెస్ అయ్యింది. ఈ రెండు పాటలు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకు వెళ్లాయి. ఇదే సమయంలో మూడవ పాటకు థమన్ సిద్దం అయ్యాడు. ఇప్పటికే విడుదలైన పాటల కంటే విభిన్నంగా ఉండేలా మూడవ పాటను థమన్ సిద్దం చేశాడు.

మూడవ పాటను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. మొదటి రెండు పాటల తరహాలో కాకుండా మూడవ పాటను చాలా విభిన్నంగా విడుదల చేసి మరోసారి యూట్యూబ్ లో సెన్షేషన్ క్రియేట్ చేయాలని థమన్ భావిస్తున్నాడట. వచ్చే వారంలో లేదా అతి త్వరలోనే మూడవ పాటను విడుదల చేయబోతున్నారట. పాటలతోనే సినిమాకు విపరీతమైన హైప్ ను తీసుకు వచ్చిన థమన్ మూడవ పాటతో మరోసారి సినిమాను వార్తల్లో ఉంచబోతున్నాడో చూడాలి.

మొదటి రెండు పాటలను తెగ ఎంజాయ్ చేసిన మెగా ఫ్యాన్స్ మూడవ పాటతో మళ్లీ పండుగకు రెడీ అవుతున్నారు. చిన్న బ్రేక్ తీసుకున్న బన్నీ అల వైకుంఠపురంలో చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు వారి నమ్మకంను మరింతగా పెంచుతున్నాయి.
Please Read Disclaimer