‘ఫిదా’ జంట పోటీ పడబోతున్నారు!

0

మెగా హీరో వరుణ్ తేజ్ – సాయి పల్లవిల కాంబినేసన్ లో శేఖర్ కుమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ ను దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ గా ఫిదా నిలిచింది. ఫిదా తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సాయి పల్లవి ఆ తర్వాత తెలుగులో మంచి ఆఫర్లు కూడా దక్కించుకుంది. వరుణ్ తేజ్ – సాయి పల్లవిల జంటకు ఫిదా జంటా అనే పేరు వచ్చింది. అలాంటి జంట ఈసారి బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టేందుకు సిద్దం అవుతున్నారు.

ఫిదా చిత్రంతో కలిసి బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ జంట ఈ సారి విడి విడిగా బాక్సాఫీస్ వద్ద ఒకే రోజున బరిలోకి దిగబోతున్నారు. వరుణ్ తేజ్ నటించిన ‘అంతరిక్షం’ మరియు సాయి పల్లవి నంటించిన ‘పడి పడి లేచే మనసు’ చిత్రాలు డిసెంబర్ 21న కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ రెండు సినిమాలపై కూడా మంచి అంచనాలున్నాయి. రెండు క్రేజీ ప్రాజెక్ట్ ఒకే రోజున రాబోతున్న నేపథ్యంలో ఓపెనింగ్ కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందనిపిస్తోంది.

వరుణ్ తేజ్ అంతరిక్షం చిత్రంకు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఘాజీ’ తరహాలోనే చాలా విభిన్నమైన నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. అంతరిక్షంలో జరిగే కొన్ని సంఘటనలను చాలా భావోద్వేగంగా దర్శకుడు సంకల్ప్ రెడ్డి చిత్రీకరించాడట. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇక శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘పడి పడి లేచే మనసు’. సాయి పల్లవికి ఇది మరో మంచి సినిమాగా నిలుస్తుందని అంతా అంటున్నారు. పోస్టర్స్ మరియు టీజర్ చూస్తూ సినిమాలో సాయి పల్లవికి చాలా ప్రాముఖ్యత ఉన్నట్లుగా అనిపిస్తోంది. ‘కణం’ మినహా సాయి పల్లవి తెలుగులో మంచి సినిమాలు చేసింది. అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందని అంచనా.

ఈ రెండు సినిమాలు కనీసం ఒకటి రెండు రోజుల గ్యాప్ లో వచ్చినా బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు ఇంకా సమయం ఉంది కనుక విడుదల తేదీల్లో ఏమైనా మార్పులు వస్తాయేమో చూడాలి.
Please Read Disclaimer