అనూ .. ఎన్నాళ్లు ఈ ఎదురు చూపులు?

0

అను ఇమ్మాన్యుయేల్ .. ఉరుములా వచ్చి మెరుపులా మాయమైన జాబితాలో ఉందీ పేరు. అగ్ర హీరోల సరసన నటించే అవకాశం వచ్చినా దురదృష్టం అన్ని వైపుల నుంచి వెంటాడింది. కారణం ఏదైనా ప్రస్తుతం అనూకి సినిమాల్లేవ్. వెల్లువలా వచ్చి ఇంతలోనే మాయమైపోయిన కథానాయికగా ఈ మలయాళీ అందం దిగాలైపోయింది.

అందానికి అందం .. గ్లామర్ యాంగిల్ లో ఈ అమ్మడికి ఎదురేలేదు. స్టార్ హీరోయిన్ అప్పీల్ ఉన్నా లక్ కలిసి రాలేదు. ఆరంగేట్రం కుర్ర హీరోల సరసన నటించి వరుస హిట్లు అందుకున్న అనూ లైఫ్ లో అనుకోని ఉత్పాతం మొదలైంది ఆ తర్వాతనే. పవన్ సరసన నటించిన అజ్ఞాతవాసి.. బన్ని సరసన నటించిన నా పేరు సూర్య డిజాస్టర్లు అవ్వడంతో ఆ ప్రభావం అనూపై తీవ్రంగా పడింది. ప్రస్తుతం పరిశ్రమ అనూపై ఐరెన్ లెగ్ అన్న ముద్ర వేసి దూరం పెట్టేసింది. దీంతో తనకు అవకాశాల్లేవ్.

ప్రస్తుతం అనూ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అప్పట్లో ఓ తమిళ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నానని చెప్పిన అనూ.. నిరంతరం సోషల్ మీడియాల్లో అభిమానులకు టచ్ లోనే ఉంది. తాజాగా అనూ ఓ ఫోటోని ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది. ఈ ఫోటోలో అనూ వైట్ టాప్ .. జీన్స్ .. దానికి ప్రత్యేకించి డిజైన్ చేసిన లాంగ్ బూట్స్ తొడుక్కుని రెబల్ క్వీన్ లా కనిపించింది. ఒకరకంగా కౌబోయ్ సినిమాల్లో వేడెక్కించే హీరోయిన్ లా అప్పియరెన్స్ ఇచ్చింది. అయితే ఇంత ఉండీ ఏం లాభం? అన్నీ ఉండీ అన్నట్టే అయ్యింది కెరీర్. బహుశా.. అవకాశాలిస్తే తాను నటించేందుకు సిద్ధమేననే సిగ్నల్ ఇచ్చేందుకే ఇలా ఫోజులిస్తోందా? మరి టాలీవుడ్ దర్శకనిర్మాతలు తనవైపు చూస్తారా.. చూడరా?
Please Read Disclaimer