ప్రొడ్యూసర్లూ కొంచెం ఇటు చూడండమ్మా

0

గండు చీమ కుట్టినట్టుగా వాచిన ఆ దొండ పెదవి.. రాత్రంతా ఏడ్చి ఏడ్చి ఎరుపెక్కినట్టుగా ఆ కనుబొమ్మలు .. ఏమిటో.. ప్చ్! ఇది విచారమో.. విరహ వేదనో అసలేంటో కనిపెట్టేందుకు బోయ్స్ చాలానే ట్రై చేస్తున్నారు కానీ.. అసలు అంతు చిక్కదేంటబ్బా!! కాస్తంత ముద్దుగా.. ఇంకాస్త బొద్దుగా.. అనూ బాగానే ఉంటుంది లెండి! అయితే ఇంతందం ఉన్నా అడవిగాచిన వెన్నెలే అవుతోంది మరి!

ఛాన్సులిచ్చేవాళ్లు కరువై.. తన వైపు చూసేవాళ్లు అయినా లేక విలవిలలాడుతోంది. సెన్సెక్స్ ని సినిమావాళ్లని కరోనా వేధించినట్టు ఈ అమ్మడు సోషల్ మీడియాల్లో నిరంతరం ఏదో ఒక కొత్త ఫోటో షేర్ చేస్తూ కుర్రకారు ను అంతే ఇదిగా వేధించేస్తోంది. అయినా ఏం లాభం? అసలు ఎవరూ పట్టించుకోరేమిటో!

అయ్యా బాబూ నిర్మాతలూ కాస్త ఇటు చూడండి. అందం కళ్ల ముందే కనిపిస్తుంటే చూడరా? కాస్త ఇటో కన్నేయండి. దర్శకులు ఇది మీక్కూడా! అజ్ఞాతవాసి ఫ్లాపైందని.. నా పేరు సూర్య డిజాస్టర్ అయ్యిందని ఏవేవో లెక్కలు వేయకండి. దురదృష్టం అదృష్టానికి మధ్య సన్నని లైన్ అడ్డుగా ఉంది. ఆ అడ్డు తొలగించి అదృష్టాన్ని ప్రసాదించండి పాపం. ఏమిటో అనూ ఇమ్మాన్యుయేల్ ఎంతగా ట్రై చేసినా సోషల్ మీడియాల్ని వేడెక్కిస్తున్నా.. ఇంకా కరుణించరేమిటో!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-