అనూ.. అలా పడకగది విరహమేల

0

అదృష్టం దురదృష్టం గురించి మాట్లాడితే పరిశ్రమలో చాలామంది పేర్లు ప్రముఖంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా పలువురు కథానాయికలను దురదృష్టం ఎంతగా వెంటాడి వేధించిందో టచ్ చేయాల్సి ఉంటుంది. వెల్లువలా వచ్చి ఇంతలోనే మాయమైపోయిన కథానాయికగా అను ఇమ్మాన్యుయేల్ పేరు మార్మోగింది.

అందానికి అందం .. గ్లామర్ యాంగిల్ లో ఈ అమ్మడికి ఎదురేలేదు. స్టార్ హీరోయిన్ అప్పీల్ తో మైమరిపించింది. ఆరంగేట్రం కుర్ర హీరోల సరసన నటించి వరుస హిట్లు అందుకున్న అనూ దుబాయ్ బేస్డ్ మలయాళీ గాళ్ కావడంతో అగ్ర హీరోలు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేశారు. అనూ కెరీర్ ఇక దూసుకెళ్లిపోతుంది అని అనుకుంటుండగానే పెద్ద జోల్ట్. వరుసగా స్టార్ హీరోల సరసన నటించిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాపులయ్యాయి. పవన్ సరసన నటించిన అజ్ఞాతవాసి.. బన్ని సరసన నటించిన నా పేరు సూర్య డిజాస్టర్లు అవ్వడంతో ఆ ప్రభావం అనూపై తీవ్రంగా పడింది. ప్రస్తుతం పరిశ్రమ అనూపై ఐరెన్ లెగ్ అన్న ముద్ర వేసి దూరం పెట్టేసింది. దీంతో తనకు అవకాశాల్లేకుండా పోయాయి.

అయితే అనూ మాత్రం ఇప్పటికీ తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అప్పట్లో ఓ తమిళ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నానని చెప్పిన అనూ.. నిరంతరం సోషల్ మీడియాల్లో అభిమానులకు టచ్ లోనే ఉంది. తాజాగా అనూ ఓ ఫోటోని ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది. ఈ ఫోటోలో అనూ సంథింగ్ హాట్ గా కనిపిస్తోంది. అద్భుతమై యాంబియెన్స్ ఉన్న ఓ బెడ్ రూమ్ ఫోటో అది. అందులో అనూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నట్టే కనిపిస్తోంది. బ్లాక్ నైట్ డిజైనర్ వేర్ లో ఆ మత్తెక్కిన కళ్లతో చిత్తు చేస్తోంది. ఆ పాల మీగడ థై సౌందర్యం ప్రత్యేకించి బోయ్స్ ని ఆకర్షిస్తోంది. బహుశా.. అవకాశాలిస్తే తాను నటించేందుకు సిద్ధమేననే సిగ్నల్ అయ్యి ఉండొచ్చు! అంటూ కామెంట్లు రువ్వుతున్నారు యూత్. మరి అనూకి పిలిచి అవకాశమిచ్చే తెలుగు దర్శకనిర్మాతలు ఎవరు అన్నది చూడాలి.
Please Read Disclaimer