ఆమె వల్ల ఎట్టకేలకు అతడికి కాస్త ఉపశమనం

0

గత ఏడాది ఇండియాలో ప్రారంభం అయిన మీటూ ఉద్యమం చాలా ఉదృతంగా ముందుకు సాగింది. పలువురు బాలీవుడ్ స్టార్స్ ను జీరోగా మార్చేసింది ఈ మీటూ. ఈ ఉద్యమంను కొందరు తప్పుగా వాడుకుంటున్నారు అంటూ మొదటి నుండి విమర్శలు వస్తున్నాయి. మీటూ వల్ల చాలా డ్యామేజ్ అయిన వారిలో ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అను మాలిక్ ఒకరు. ఆయనపై పలువురు సింగర్స్ డైరెక్ట్ గా కొందరు ఇండైరెక్ట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడు పాడే అవకాశం ఇస్తానంటూ పడుకొమ్మనేవాడు అంటూ అతడి తీరుపై సింగర్స్ సంచలన ఆరోపణలు చేశారు.

ఇటీవల కూడా ప్రముఖ సింగర్ శ్వేతా పండిట్ మరోసారి అనుమాలిక్ పై మీటూ ఆరోపణలు చేసింది. నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే నాపై లైంగిక దాడికి ఆయన ప్రయత్నించాడంటూ ఆరోపించింది. పలువురు పలు రకాలుగా అను మాలిక్ పై ఆరోపణలు చేస్తున్న ఈ సమయంలో ఇప్పటికే ఆయన ఇమేజ్ జీరోకు వచ్చింది. ఇలాంటి సమయంలో ఒక సింగర్ ఆయనపై పాజిటివ్ గా స్పందించడంతో కాస్త ఉపశమనం దక్కినట్లయ్యింది.

ప్రముఖ సింగర్ హేమా సర్దేశాయ్ ఇటీవల అను మాలిక్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా ఫేమస్ సింగర్స్ గా వెలుగు వెలుగుతున్న వారిలో చాలా మందికి అను మాలిక్ లైఫ్ ఇచ్చారు. అలాంటి సింగర్స్ లో నేను ఒకదాన్ని. ఆయన నాకు లైఫ్ ఇవ్వడం వల్లే నేను ఈ స్థితిలో ఉన్నానంటూ ఆమె చెప్పుకొచ్చింది. చాలా ఏళ్ల క్రితం నాకు ఇండస్ట్రీలో ఆఫర్లు వచ్చేవి కాదు. ఆ సమయంలో ఆఫర్ల కోసం నేను పడుకునే రకం కాదని బాహాటంగానే చెప్పాను. కాని ఎవరు నాకు సపోర్ట్ గా నిలవలేదు. అను మాలిక్ నాకు ఆఫర్ ఇచ్చారు. ఆయన కేవలం ట్యాలెంట్ చూసే ఆఫర్స్ ఇస్తాడని హేమా పేర్కొంది.

ప్రస్తుతం అను మాలిక్ పై మీటూ ఆరోపణలు చేస్తున్న వారిని హేమా ఒక ప్రశ్న అడిగింది. ఇన్నాళ్లు మీరు ఎందుకు అను మాలిక్ పై వ్యాఖ్యలు చేయకుండా ఉన్నారు.. అను మాలిక్ కాకుండా మీరు ఇతర సంగీత దర్శకులతో వర్క్ చేసి ఉంటారు. వారు ఏమైనా దేవుళ్లా అంటూ ప్రశ్నించింది. పబ్లిసిటీ కోసం మీరు ఇప్పుడు ఈ విషయాన్ని వినియోగించుకుంటున్నారు అంటూ హేమా ఆ సింగర్స్ పై రివర్స్ అయ్యింది.

హేమా సర్దేశాయ్ వ్యాఖ్యలకు శ్వేతా పండిట్ స్పందించింది. ఒక మహిళ అయ్యి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు. నీ మాటలు ఎలా ఉన్నాయంటే మేమే కావాలని రేప్ చేయించుకున్నట్లుగా ఉన్నాయి. అసలేం అనుకుంటున్నావు.. ఇలాంటి విషయాల్లో సపోర్ట్ చేయకున్నా పర్వాలేదు కాని మమ్ములను తప్పుపట్టే విధంగా మాట్లాడే అర్హత నీకు లేదు అంటూ హెచ్చరించింది. సోషల్ మీడియాలో హేమా మరియు శ్వేతాల మద్య మాటల యుద్దం కొనసాగుతోంది.
Please Read Disclaimer