మాఫియా భయంలో ఫేమస్ సింగర్..

0

జస్లీన్ మాతరు. సినీ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయంలేని పేరు. యూట్యూబ్ ప్రేక్షకులకు మాత్రం జస్లీన్ గాయనిగా సుపరిచితురాలే. కొన్ని పాటలతో యూట్యూబ్ లో ఆడి పాడి అలరించి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ముంబైలోనే పుట్టి పెరిగిన జస్లీన్ ‘బిగ్ బాస్ సీసన్-12’ తో దేశవ్యాప్తంగా టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గరైంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కంటే కూడా హిందీ డివోషనల్ గజల్స్ సింగర్ అనూప్ జలోటా ప్రియురాలిగా విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది. బిగ్ బాస్ రియాలిటీ షోతో ఫేమస్ అవుతున్నకొద్దీ వివాదాలకు దారితీస్తూ వచ్చింది.

బిగ్ బాస్ అనంతరం జస్లీన్ ‘స్వయంవరం’ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వలన ఇంటికే పరిమితమైంది. అయితే దేశ ప్రజలంతా కరోనాకు భయపడుతుంటే జస్లీన్ మాత్రం మాఫియాకు భయపడుతుందట. స్వయంవరం షో తర్వాత జస్లీన్ కి ఎవరో గుర్తుతెలియని దుండగులు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారట. అంతేగాక మేం చెప్పింది చేయకపోతే నీతో పాటు నీ ఫ్యామిలీని కూడా చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారట. ఈ దెబ్బతో అమ్మడు దగ్గరలోని పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది.

ముంబైలోని ఓషివారా పోలీసులకు జరిగినదంతా వివరించి తనకు తన ఫ్యామిలీకి రక్షణ కల్పించాలని కోరిందట జస్లీన్. ఎల్లప్పుడూ నవ్వుతూ హాట్ హాట్ అందాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వడ్డిస్తూ ఉండే జస్లీన్ కి సడన్ గా ఏమైందంటూ ఆమె అభిమానులు కంగారు పడుతున్నారట. దీనిపై స్పందించిన పోలీసులు చర్యలు తీసుకుంటామని తెలిపి ఫిర్యాదును నమోదు చేసుకున్నారట. చూడాలి మరి హాట్ జస్లీన్ అందాలపై గురిపెట్టిన ఆగంతకులు ఎవరో..!
Please Read Disclaimer