అనుపమ టాలీవుడ్ జర్నీ ముగిసినట్టేనా?

0

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కు తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపే ఉంది. ‘శతమానం భవతి’.. ‘అ ఆ’ లాంటి సూపర్ హిట్లు ఆమె లిస్టులో ఉన్నాయి. అయితే ఈమధ్య అనుపమ కెరీర్ స్లో అయింది. ‘ఉన్నది ఒకటే జిందగీ’.. ‘కృష్ణార్జున యుద్ధం’.. ‘తేజ్ ఐ లవ్ యూ’.. ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాలు వరసగా ఫ్లాప్ కావడంతో అనుపమ డీలా పడింది. బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించిన ‘రాక్షసుడు’ విజయం సాధించడంతో కొంత రిలీఫ్ దక్కింది. రిలీఫ్ దక్కింది కానీ క్రేజీ ఆఫర్లు మాత్రం రావడం లేదు.

కెరీర్ మొదట్లో అనుపమ మీడియం రేంజ్ హీరోలతో నటించింది కానీ స్టార్ హీరోల సినిమాల్లో ఎప్పుడూ అవకాశం దక్కలేదు. ఇప్పుడు కనీసం మీడియం రేంజ్ హీరోల సినిమాలలో కూడా ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో ఒకే ఆఫర్ ఉందట. దిల్ రాజు కుటుంబం నుంచి వస్తున్న హీరో డెబ్యూ సినిమా లో అనుపమకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారని సమాచారం. డెబ్యూ హీరోల సినిమాల సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏదో చేతిలో ఒక ఆఫర్ ఉందని చెప్పుకునేందుకు పనికొస్తుంది కానీ క్రేజీ ఆఫర్ మాత్రం కాదు.

ఈ సినిమా తప్ప అనుపమకు చేతిలో మరో ఆఫర్ లేదు. దీంతో అనుపమ కెరీర్ కు టాలీవుడ్ లో దాదాపు గా ఫుల్ స్టాప్ పడ్డట్టేనని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. హ్యాట్రిక్ విజయాలతో టాలీవుడ్ జర్నీ ప్రారంభించిన అనుపమ కెరీర్ లో ఇలా గడ్డుపరిస్థితి ఎదుర్కోవడం ఆశ్చర్యకరమే. మరి దిల్ రాజు కాంపౌండ్ సినిమా అనుపమ కు కెరీర్ కు మేలు చేస్తుందేమో వేచి చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-