18 పేజెస్ కుమారి ఏమిటిలా ఎక్స్ ప్రెషన్ పెట్టింది?

0

ప్రేమమ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ చూస్తుండగానే ఏడెనిమిదేళ్ల కెరీర్ బండిని సాగించేసింది. హిట్లు ఫట్లుతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో ఈ అమ్మడికి వీర ఫాలోయింగ్ పెరిగింది. మల్లూవుడ్ విడిచి టాలీవుడ్ చుట్టూనే ఈ అమ్మడు ఎక్కువగా ప్రదక్షణలు చేయడానికి ఇదే కారణం. అయితే ఇటీవల ఎందుకనో ఆఫర్లు ముఖం చాటేశాయి. నెమ్మది నెమ్మదిగా ఇప్పుడే కోలుకుంటోంది.

అఆ.. శతమానం భవతి.. ఉన్నది ఒక్కటే జిందగీ.. ఇవన్నీ అనుపమ ట్యాలెంట్ ని ఎలివేట్ చేసుకునేందుకు దక్కిన అవకాశాలు. కానీ అసాధారణ స్టార్ డమ్ అనేది మాత్రం చేతికి చిక్కలేదు. దీంతో అనుపమ కాస్త నిరాసపడిన మాట వాస్తవం. అయితే ఈసారి మాత్రం భల్లూక పట్టు పట్టాలన్న పంతంతో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవల నవతరం హీరోలు ఈ అమ్మడికి పిలిచి అవకాశాలిస్తున్నారు. నాని.. బెల్లంకొండ.. నిఖిల్ సహా పలువురు స్టార్లు అనుపమ పేరును పరిశీలించడం కలిసొస్తోంది. రాక్షసుడు చిత్రంతో బంపర్ హిట్ కొట్టాక ఇరుగు పొరుగు భాషల్లో పలు చిత్రాలకు సంతకాలు చేసింది. 2020లో అనుపమ రెండు సినిమాలకు సంతకాలు చేసింది. `మనియరయిఏ అశోకన్` అనే మలయాళ సినిమాలో నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఇది రిలీజ్ కానుంది. దీంతో పాటు తాళ్లి పోగతే అనే సినిమాలోనూ నటిస్తోంది.

ఇక టాలీవుడ్ లో నిఖిల్ లాంటి క్రేజీ హీరో సరసన 18 పేజెస్ చిత్రంలో నాయికగా నటిస్తోంది. ఇది తన కెరీర్ కి పెద్ద ప్లస్ అవుతుందనే అనుపమ భావిస్తోందట. సుకుమార్ – అల్లు అరవింద్ వంటి దిగ్గజాలు కలిసి నిర్మిస్తున్న క్రేజీ చిత్రంగా దీనిపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కుమారి 21 ఎఫ్ ఫేం .. సుక్కూ శిష్యుడు సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు కాబట్టి క్రేజు మరింతగా పెరిగింది. మరి ఈసారి అనుపమ బ్లాక్ బస్టర్ కొట్టి మరో కుమారిగా వెలిగిపోతుందేమో చూడాలి. తాజాగా ఇన్ స్టాలో ఓ ఫోటోని షేర్ చేసి తనకు జలుబు చేసిందని తెలిపింది. ఆ ఎక్స్ ప్రెషన్ క్యూట్ గా అభిమానుల్ని ఆకట్టుకుంది.