ఎట్టకేలకు తెలుగులో కంబ్యాక్ అవుతోంది!

0

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కెరీర్ డైలమా గురించి తెలిసిందే. తనదైన అందం అభినయంతో కొంతకాలం నెట్టుకొచ్చినా.. ఎందుకనో ఈ అమ్మడికి అదృష్టం మొహం చాటేసింది. వరుస ఫ్లాపులు కెరీర్ ని చిక్కుల్లోకి నెట్టేశాయి. `అఆ` తర్వాత ఈ అమ్మడి కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది. అటుపై రెండు..మూడు సినిమాలు సరైన ఫలితాలు సాధించకపోవడంతో రేసులో బాగా వెనుకబడింది. ఇటీవలే రాక్షసుడు సినిమా ఊరటనిచ్చినా పెద్దగా అవకాశాలు అయితే వెంటపడలేదు. ప్రస్తుతం మాతృభాష మలయాళంలో ఒక సినిమా చేస్తోంది. కొంత గ్యాప్ తర్వాత తాజాగా తెలుగులో దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి కుమారుడి సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందని సమాచారం. గత కొంతకాలంగా దీనిపై రకరకాల రూమర్లు వినిపించినా ఇప్పుడు అధికారికమేనని ఆ కాంపౌండ్ నుంచి తాజా లీక్ అందింది.

శిరీష్ రెడ్డి తనయుడు అశిష్ హీరోగా రాజుగారు ఓ సినిమాకు సన్నాహాకాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ నచ్చడంతో దానిని లాక్ చేసారు. దర్శకరచయిత వివరాల్ని గోప్యంగా ఉంచడంతో ఆ డీటైల్స్ తెలియాల్సి ఉంది. ఇప్పటికి అశీష్ కు జోడీగా అనుపమ అయితే బాగుంటుందని రాజుగారు భావిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలతో పాటు..అనుపమ విషయాన్ని దిల్ రాజు అధికారికగా వెల్లడించనున్నారట.

గతంలో శ్రీవెంకటేశ్వర బ్యానర్ లో అనుపమ శతమానం భవతి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు జాతీయ అవార్డు దక్కడంతో ఆ బ్యానర్ పేరు నేషనల్ లెవల్లో మార్మోగింది. ఆ సెంటిమెంట్ తోనే రాజుగారు ఇప్పుడు అనుపమను వెనక్కి తెస్తున్నారా? అన్న వ్యాఖ్య వినిపిస్తోంది. ఇక ఆశీష్ కు ప్రొడక్షన్ పై గ్రిప్ ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో పలు సినిమాలకు సహ నిర్మాతగా వ్యవరించాడు. రాజుగారిలా తెరవెనక రాటు దేలాక.. ఇప్పుడు తనదైన స్టైల్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడన్నమాట.
Please Read Disclaimer