అలా చేజార్చుకుని ఫీలైతే ఎలా క్యూటీ?

0

`ప్రేమమ్` తో మాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళీ బ్యూటీ అదే సినిమా రీమేక్ తో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీని ఆకర్షించింది. కానీ స్టార్ హీరోలని మాత్రం ఎట్రాక్ట్ చేయలేకపోయింది. అయితే హీరోయిన్ గా తన దశను మార్చే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుని ఇప్పుడు ఫీలవుతోంది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ రూపొందించిన `రంగస్థలం`లో తొలి ఆఫర్ ఈ అమ్మడికే వచ్చింది. ఇందులో చిట్టిబాబుకు జోడీగా రామలక్ష్మి పాత్ర కోసం చిత్ర బృందం ముందు మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ నే ఎంచుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ స్థానంలో అనుపమని తప్పించి సమంతని ఫైనల్ చేశారని ప్రచారమైంది.

ఆ ప్రచారంపై ప్రశ్నిస్తే తాజాగా అనుపమ పలు ఆసక్తికర విషయాల్ని చెప్పింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న `రాక్షసన్` చిత్రంలో అనుపమ నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన అనుపమ `రంగస్థలం` చిత్రాన్ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. ఆ ఆఫర్ వచ్చిన సమయంలో వేరే చిత్రానికి కమిటైందట. కాల్షీట్ల సమస్య కారణంగా `రంగస్థలం` వదులుకోవాల్సి వచ్చిందట. అందుకు ఇప్పటికీ బాధపడుతూనే వుంటానని తెలిపింది.

అయితే రామలక్ష్మి పాత్రలో సమంత నటన చూశాక నేను ఆస్థాయిలో నటించేదాన్ని కాదేమో అని ఫీలైందట. ఆ పాత్రకు సమంత నూరు శాతం న్యాయం చేసిందని ప్రశంసించింది. సరే.. ఒక ఆఫర్ వదులుకున్నంత మాత్రాన అదే పూర్తి ఛాయిస్ కాదు. అలాంటి మ్యాజికల్ ఛాన్సెస్ ఎన్నో వస్తుంటాయి. ప్రస్తుతం చేసే సినిమాలతో అనుపమ నిరూపించుకుంటే చాలు. ఇటీవల ఫ్లాప్ బ్యూటీగా ముద్ర పడింది. దానినుంచి బయటపడేందుకు ఏం చేయబోతోంది అన్నదే అసలు పాయింట్.
Please Read Disclaimer