ప్రేమలో ప్రేమమ్ బ్యూటీ?

0

తెలుగు ప్రేక్షకులకు ప్రేమమ్.. అఆ చిత్రాలతో పరిచయం అయిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ఆశించినంత స్పీడ్ గా సాగడం లేదు. మెల్లగా అడపా దడపా ఆఫర్లతో కెరీర్ ను ఈ అమ్మడు నెట్టుకు వస్తోంది. ఈ అమ్మడు తాజాగా రాక్షసుడు అనే చిత్రంతో తెలుగులో సక్సెస్ దక్కించుకుంది. ఇదే సమయంలో తమిళంలో వరుసగా రెండు సినిమాలు చేస్తోంది. తెలుగులో కాకున్నా తమిళంలో అయినా సక్సెస్ కొట్టాలనే ఈ అమ్మడు పట్టుదలతో ఉంది.

నిన్న ఈ అమ్మడు పుట్టిన రోజు జరుపుకుంది. తనకు 24 ఏళ్లు వచ్చాయంటూ చెప్పకనే చెప్పింది. ఇదే సమయంలో తాను పెళ్లి వయసుకు వచ్చినట్లుగా గుర్తు చేస్తూ తన పుట్టిన రోజు సందర్బంగా దంపతుల ఫొటోను పోస్ట్ చేసి నువ్వు నేను అందమైన ప్రేమ జంట అంటూ కామెంట్ పెట్టింది. దాంతో ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ప్రేమలో ఉన్న ఈ అమ్మడు ఇప్పటి వరకు ఆ విషయంపై ఎలాంటి హింట్ ఇవ్వలేదు. కాని తన బర్త్ డే సందర్బంగా హింట్ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. సినిమాల్లో ఆఫర్లు లేకపోవడంతో ఒకటి రెండేళ్ల తర్వాత ఈమె తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-