అనుపమ మనసు బాగా నొచ్చుకున్నట్లుంది

0

తెలుగు ప్రేక్షకులకు ‘అఆ’ సినిమాలో నాగవల్లి పాత్రతో పరిచయం అయిన మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత వరుసగా తెలుగు మరియు తమిళంలో సినిమాలు చేస్తోంది. ఈమెకు సౌత్ ఇండియా మొత్తం గుర్తింపు రావడంకు కారణం మలయాళ ‘ప్రేమమ్’ సినిమా. ఆ సినిమాలో ఈమె పోషించిన మేరీ జార్జ్ పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు మరియు తమిళంలో ఈమెకు ఆఫర్లు రావడానికి కారణం ఆ పాత్ర అనడంలో సందేహం లేదు. తనకు అంతటి గుర్తింపు తెచ్చి పెట్టిన మలయాళ సినిమా పరిశ్రమ అంటే అనుపమకు ఎందుకో కోపం. అందుకే గత అయిదు సంవత్సరాల కాలంలో అక్కడ ఒక్క సినిమా కూడా చేయలేదు.

తెలుగు మరియు తమిళంలో వరుస సినిమాల్లో చేస్తూ ఆకట్టుకుంటున్న కారణంగా ఈమెకు మలయాళంలో కూడా స్టార్స్ మూవీలో ఛాన్స్ వచ్చాయి. కాని ఈమె మాత్రం వాటికి సున్నితంగా నో చెప్పింది. కెరీర్ ఆరంభంలో తన గురించి మలయాళ సినిమా పరిశ్రమలో జరిగిన ప్రచారం కారణంగానే మళ్లీ అక్కడ సినిమాలు చేయాలనే ఆలోచన పోయిందంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.

చిన్న వయసులోనే అక్కడ విమర్శలు ఎదుర్కోవడం మరియు మోస పోవడం వంటివి జరగడం వల్ల మలయాళ సినిమా పరిశ్రమ అంటే తనకు ఒక చెడ్డ అభిప్రాయం పడినది. అందుకే సొంత భాష అయినా కూడా అక్కడ నటించాలనే ఆసక్తి నాకు లేదు అంది. భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేను. కాని ప్రస్తుతానికి మాత్రం తాను మలయాళంలో నటించాలని అనుకోవడం లేదు అంటూ పేర్కొంది. అందుకు సంబంధించిన కారణం ఏంటీ అనే విషయంలో ఆమె స్పందించలేదు. కాని కొన్ని సంఘటనలు నన్ను ఇలా మార్చాయని అంటోంది.