దిల్ రాజు మేనల్లుడితో అనుపమా పరమేశ్వరన్ రొమాన్స్!

0

మలయాళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌కు తెలుగులో బోలెడంత ఫాలోయింగ్. ఆమె అందానికి, నటనకు ఫిదా అవ్వనివారు ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తికాదు. ‘ప్రేమమ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనుమప.. తొలి సినిమాతోనే ఎక్కడలేని క్రేజ్ సంపాదించేసింది. ఇక 2016లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో అనుపమా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అదే ఏడాది వచ్చిన తెలుగు ‘ప్రేమమ్’ సినిమాలోనూ అనుపమ నటించింది.

ఇక ‘శతమానం భవతి’ సినిమాతో అనుపమకు తెలుగులో ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఆ తరవాత ‘కృష్ణార్జున యుద్ధం’, ‘తేజ్ ఐ ల‌వ్ యూ’, ‘హ‌లో గురు ప్రేమకోస‌మే’ సినిమాల్లో నటించింది. ఈ చిత్రాల్లో అనుపమ నటనకు మంచి మార్కులే పడినా సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే కిదండేటాది అనుపమ నటించిన ‘రాక్షసుడు’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తరవాత మరో తెలుగు సినిమాను అనుమప అంగీకరించలేదు. అయితే, తాజాగా ఆమె ఒక తెలుగు సినిమాకు సైన్ చేశారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన మేనల్లుడు అశిష్ రెడ్డిని హీరోగా పరిచయం చేయబోతున్నారు. అశిష్ రెడ్డి అరంగేట్రం చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా అనుపమను సంప్రదించారు. నిజానికి దిల్ రాజుతో అనుపమకు మంచి అనుబంధం ఉంది. దిల్ రాజు నిర్మించిన ‘శతమానం భవతి’ సినిమాతో అనుపమకు మంచి బ్రేక్ వచ్చింది. అలాగే, దిల్ రాజు నిర్మాతగా వచ్చిన ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం కూడా విజయాన్ని అందుకుంది.

దిల్ రాజు మీద గౌరవంతో ఆయన మేనల్లుడు సరసన నటించడానికి అనుమప వెంటనే అంగీకరించారట. ఈ చిత్రానికి ‘హుషారు’ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి పెద్దగా ప్రచారం ఏమీ చేయలేదు. ఇప్పటికే రెగ్యులర్‌ షూటింగ్ మొదలైపోయింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-