అమ్మ దొంగా.. హీల్స్ తో కవరింగా?

0

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ మందే ఉంటారు. ‘శతమానం భవతి’ లాంటి సూపర్ హిట్లు ఆమె లిస్టులో ఉన్నాయి కాబట్టి కొత్తగా అనుపమను పరిచయం చెయ్యనవసరం లేదు. ఈమధ్య కెరీర్ కాస్త స్లో అయినట్టు అనిపించింది కానీ బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించిన ‘రాక్షసుడు’ తో ఒక హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ఇక అనుపమ అందరిలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.

ఈరోజు తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు “త్రోబ్యాక్-రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పాత ఫోటో అన్నమాట. ఈ ఫోటోలో గ్లామరసం ట్యాప్ తిప్పడాలు.. అందాలు ధారపోయడాలు ఏమీ లేవు. మెరూన్ టీ షర్టు.. జీన్స్.. నడుముకు స్టైల్ గా కట్టుకున్న షర్టు.. క్యాప్ తో మోడరన్ గా కనిపించింది. అయితే హైలైట్ మాత్రం అనుపమ ధరించిన హైహీల్స్. అనుపమ మరీ పొడగరి ఏం కాదు. కాస్త హైట్ తక్కువ.. అందుకే హీల్స్ ధరించి పొడవుగా కనిపించే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాన్ని కొందరు నెటిజన్లు గుర్తించారు. “అమ్మదొంగా హీల్స్ తో హైట్ కవర్ చేస్తున్నావ్ కదా” ఈ విషయాన్ని ప్రస్తావించారు.

అయితే ఇలా పొడవు.. పొట్టి.. లావు లాంటివి పాజిటివ్ గా మాట్లాడితే సరే కానీ కొంచెం శృతి మించితే దాన్నే బాడీ షేమింగ్ అంటూ విపరీతార్థాలు తీస్తారు కాబట్టి ఈ టాపిక్ ను ఇంతకంటే ఎక్కువ కొనసాగించడం డేంజర్. అయితే ఈ హైట్ కవరింగ్ సంగతి పక్కన పెడితే చాలామంది నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “అనూ.. సో క్యూట్”.. “కేరళ కుట్టి.. హెయిర్ స్టైల్ సూపర్” అంటూ పొగడ్తలు కురిపించారు. అనుపమ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ నటించే మలయాళం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer