AK 47 తో సరసాలాడుతున్న శుభ్ర

0

బాలీవుడ్ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ నిన్న మంగళవారం తన 47 వ పుట్టినరోజు జరుపుకున్నాడు. అనురాగ్ కశ్యప్ అంటే AK. నలభై ఏడు రావడంతో ఆ ఏకే కి 47 తగిలించి AK47 అంటూ సోషల్ మీడియాలో జోరుగా హంగామా జరిగింది. రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో అనురాగ్ వ్యవహారం కాస్త తేడాగానే ఉంటుంది. అందుకే ఆ ఏకే47 టైటిల్ కూడా కరెక్ట్ గా సెట్ అవుతుంది.

అనురాగ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మొదట ఆర్తి బజాజ్ ను వివాహం చేసుకున్నాడు. దాదాపు పన్నెండేళ్ళ దాంపత్యం తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇద్దరికీ అలియా కశ్యప్ అనే కూతురు ఉంది. అనురాగ్ బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్ ను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం సింగిలే కానే తన దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన శుభ్ర శెట్టితో రిలేషన్ లో ఉన్నాడు. అనురాగ్ వయసు 47 అయితే శుభ్ర వయసు జస్ట్ 26.

అనురాగ్ పుట్టిన రోజు సందర్భంగా శుభ్ర “నువ్వు 17166 రోజులు జీవించావు. కీప్ గోయింగ్” అంటూ అనురాగ్ ను వెరైటీగా విష్ చేసింది. మనోడు అసలే బ్రిలియంట్ ఫిలిం మేకర్ కదా.. వెంటనే దానికి రిప్లై ఇస్తూ “థాంక్యూ.. నువ్వు ఇప్పటి వరకు జస్ట్ 9547 రోజులు మాత్రమే జీవించావు.. నాతో పోటీపడే ప్రయత్నం చేయకు” అంటూ కౌంటర్ ఇచ్చాడు. అనురాగ్ – శుభ్ర మధ్య జరిగిన ఈ చాట్ ఇన్ స్టాలో చాలామంది నెటిజన్లను ఆకర్షించింది. ఇక ఈ AK47 కు మాజీ భార్య కల్కి నుంచి కూడా బర్త్ డే విషెస్ అందాయి..”హ్యాపీ బర్త్ డే AK 47.. నువ్వు చాలా కాలం వైల్డ్ గా కలర్ఫుల్ సినిమాలు తీస్తూ ఉండాలి” అంటూ పర్ఫెక్ట్ గా విష్ చేసింది. సినిమాల విషయానికి వస్తే అనురాగ్ కశ్యప్ ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదు కానీ నెట్ ఫ్లిక్స్ అంథాలజీ చిత్రం ‘ఘోస్ట్ స్టోరీస్’ పై వర్క్ చేస్తున్నాడు.




Please Read Disclaimer