భూతల స్వర్గంలో విరుష్క విహారం

0

రెండు విభిన్న రంగాలకు చెందిన స్టార్లు ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకుంటే ఆ ఇద్దరి మధ్యా గమ్మత్తయిన కెమిస్ట్రీనే వర్కవుట్ అవుతుందనడానికి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ జంటనే నిదర్శనం. అనుష్క – విరాట్ ఇద్దరూ మ్యారేజ్ గోల్స్ సెట్ చేసే జంటల్లో ముందు వరుసలో ఉంటారు. ఈ జోడీ రెగ్యులర్ ఫోటోషూట్లతో అంతార్జాలంలో వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కలిసి ఒక కార్యక్రమానికి హాజరైనా లేదా క్రికెట్ టోర్నమెంట్లలో సమయాన్ని వెచ్చించినా.. అనుష్క – విరాట్ జోడీ కెమిస్ట్రీ చూపురుల్ని దోచేస్తుంది.

ఓవైపు టీమిండియా కెప్టెన్ గా క్షణం తీరిక లేకుండా ఉన్న విరాట్ టోర్నమెంట్లు ఆడుతూనే భార్య అనుష్కతో విరామ సమయాన్ని జాలీగా స్పెండ్ చేస్తుంటాడు. నిరంతరం అనుష్కతో కలిసి ఉన్న ఫోటోల్ని అభిమానులతోనూ పంచుకుంటాడు. తాజాగా విరుష్క జంట వెకేషన్ కి సంబంధించిన ఫోటో ఒకటి అతడు షేర్ చేశాడు. భూతల స్వర్గం అనిపించే ఓ అరుదైన స్పాట్ లో ఆ జంట ఉన్నారు. ఈ జంట లుక్ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. అనుష్క సైడ్ స్లిట్ బ్లాక్ స్కర్ట్ ని ధరించింది. విరాట్ బ్లాక్ షార్ట్స్ తో గ్రే టీస్ ని ధరించి స్టైలిష్ గా కనిపించాడు. ఆ ఇద్దరూ సన్ గ్లాసెస్ ధరించి సూటిగా చూస్తున్నారు. కొండ అంచున బ్లూ వాటర్స్ ముందు సుందరమైన ప్రదేశంలో ఆ ఫోజు ఫ్యాన్స్ లోకి దూసుకెళుతోంది.

ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీగా ఉన్నా జంట సెలబ్రేషన్స్ ని ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ కి చేరవేస్తున్నారు. ఇక కెరీర్ పరంగా చూస్తే.. విరాట్ టెస్ట్ మ్యాచ్ టోర్నమెంట్ లో బిజీగా ఉండగా.. అనుష్క శర్మ ఇప్పటికే ఫరా ఖాన్ – రోహిత్ శెట్టి కాంబినేషన్ మూవీ `సత్తే పె సత్తా` రీమేక్ విషయమై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో నటిస్తున్న విషయాన్ని అనుష్క శర్మ ధృవీకరించలేదు. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన `జీరో`లో షారుఖ్ ఖాన్ – కత్రినా కైఫ్ లతో కలిసి నటించిన అనుష్క తదుపరి పలు క్రేజీ ప్రాజెక్టులకు సంతకాలు చేసింది. మరోవైపు సొంత నిర్మాణ సంస్థలో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలపైనా దృష్టి సారిస్తోందట.
Please Read Disclaimer