తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన స్వీటీ!

0

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరంటే ఠక్కున చెప్పే సమాధానం అనుష్క ప్రభాస్. కథ కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య నడుస్తున్న పెళ్లి వార్తలకు పుకార్లకు పుల్ స్టాప్ పెట్టేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ తో లవ్ లాంటిది ఏమి లేదని కేవలం మా మధ్య స్నేహం మాత్రమే ఉందని తేల్చిచెప్పింది స్వీటీ.. ఇది కూడా అనుష్క పేరేలెండి.

అభిమానులు ఊరుకుంటారా.. స్వీటీ పెళ్లి ప్రభాస్ తో కాదు అని చెప్పిందంటే.. మరి ఎవరిని చేసుకోబోతుంది అనేది పెద్ద చర్చగా మారింది. నిజానికి అనుష్కకి సౌత్ ఇండియా అంతటా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూపర్ సినిమా నుండి అనుష్క మీద అభిమానులు మనసు పారేసుకుంటూనే ఉన్నారు. అనుష్కకు పెళ్లి కాబోతుందన్న ప్రతిసారి అమ్మడి అభిమానులు ఏదో కోల్పోయిన ఫీలింగ్ లోకి వెళ్లిపోతున్నారు. అంతలా నాటుకు పోయింది మరి ప్రతి మదిలో..

ఇక అనుష్క ఇటీవలే ఒక వ్యాపారవేత్త కుమారుడిని పెళ్లిచేసుకోనుందని పుకార్లు క్రియేట్ అయ్యాయి. అది కూడా నిజం కాదు అని తేలేసరికి.. బయటివాళ్లను కాదు ఇండస్ట్రీలోనే ఒక ఫేమస్ డైరెక్టర్ కొడుకుని పెళ్లాడనుందని ప్రచారం జరిగింది. అయితే ఆ ఫేమస్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారే ఆయన కొడుకు ప్రకాష్ ని అనుష్క పెళ్లి చేసుకోబోయేది అని ఇండస్ట్రీ మొత్తం కోడై కూసింది. అయితే అనుష్క ఈ విషయం పై స్పందించి ప్రకాష్ తో నా పెళ్లి అనేది పుకారు మాత్రమేనని బల్లగుద్ది చెప్పింది. స్వీటీ క్లారిటీ ఇవ్వడంతో ప్రకాష్ ఉపిరి పీల్చున్నాడట. అయితే స్వీటీ ఇంకా సింగిలే అని తెలిసి ఆమె అభిమానులు గాల్లో తేలిపోతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-