అతడితో పెళ్లి వార్తలకు హర్ట్ అయిన అనుష్క

0

అనుష్క పెళ్లి వార్తలు ఈమద్య వస్తున్నవి కాదు. గత నాలుగు అయిదు సంవత్సరాలుగా అనుష్క పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఎక్కువ కాలం ప్రచారం జరిగింది. ఆ తర్వాత క్రికెటర్ తో ఈ అమ్మడు డేటింగ్ లో ఉందని ప్రచారం జరిగింది. వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా విడాకులు తీసుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడిని వివాహం చేసుకోబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

ఇన్ని రోజులు పెద్దగా స్పందించని అనుష్క.. ఎప్పుడు సరదాగే పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చే అనుష్క ప్రకాష్ కోవెలమూడితో వివాహం గురించి వచ్చిన వార్తలపై హర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అనుష్క సినీ కెరీర్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఒక ఇంగ్లీష్ డైలీకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఒక డైవర్సీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నట్లుగా కథనాలు రావడంపై ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

పెళ్లి అనేది జీవితంలో చాలా సున్నితమైన విషయం. ఆ విషయాన్ని గుర్తించకుండా ఎందుకు మీరు ఇలాంటి ప్రకటనలు ప్రచారాలు చేస్తున్నారు. ఆ వార్తలు వారిని వారి కుటుంబ సభ్యులను ఎంతగా ప్రభావితం చేస్తాయో తెలుసుకోకుండా ఎలా ఇలాంటి వార్తలను రాస్తారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి అనేది ముఖ్యమైన విషయం. దాన్ని ఎవరు దాయలేరు.

సెలబ్రెటీలు ఎవరితో అయినా ప్రేమలో ఉంటే ఖచ్చితంగా ఆ విషయాన్ని దాచలేరు. రహస్యంగా ఉంచాల్సిన అవసరం నాకు లేదు. ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో అప్పుడు నా పెళ్లి విషయాన్ని ఖచ్చితంగా నేను సంతోషంగా బయటకు చెప్తాను అంది. అనుష్క ప్రస్తుతం ‘నిశబ్దం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. వచ్చే నెలలో ఆ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-