లేడీ సూపర్ స్టార్ డంకు 15 ఏళ్లు

0

సూపర్ చిత్రం తో అయిష్టంగానే హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనుష్క ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకుంది. గ్లామర్ రోల్స్ అయినా.. లేడీ ఓరియంటెడ్ రోల్స్ అయినా.. ఇంకా ఎలాంటి పాత్రలైనా కూడా ఆమె ముందు ఒదిగి పోవాల్సిందే. అరుంధతి చిత్రంతో హీరోల స్థాయి స్టార్ డంను దక్కించుకున్న అనుష్క ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు. కెరీర్ ఆరంభించినప్పటి నుండి కూడా అనుష్క ప్రయోగాత్మక పాత్రలు చేస్తూనే ఉంది.

రాజమౌళి దర్శకత్వంలో రవితేజకు జోడీగా విక్రమార్కుడు చిత్రంలో గ్లామర్ పాత్రను పోషించి అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో ఈ అమ్మడికి కోలీవుడ్ లో కూడా ఛాన్స్ లు దక్కాయి. అక్కడ పలువురు స్టార్ హీరోల సరసన నటించినా కూడా తెలుగులోనే ఈ అమ్మడు ఎక్కువగా సినిమాలు చేసింది. హీరోయిన్ గా అందాలు ఆరబోతున్న సమయం లో ఈమెను కోడిరామకృష్ణ ‘అరుంధతి’గా మార్చేశాడు. అప్పటి నుండి ఈమె మరింత స్టార్డంను సొంతం చేసుకుంది.

అనుష్క హీరోయిన్ గా పరిచయం అయ్యి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పదిహేను సంవత్సరాల్లో ఆమె ఎన్నో అద్బుతమైన పాత్రలు పోషించింది. ఈమద్య కాలంలో ఈమె సినిమాల సంఖ్య తగ్గాయి. పదేళ్లు వెనక్కు తిరిగి చూసుకోకుండా సినిమాల్లో నటించింది. ఇప్పటికి ఈమెకు వరుసగా ఆఫర్లు ఇచ్చేందుకు మేకర్స్ సిద్దంగా ఉన్నారు. కాని అనుష్క మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఒక్కో సినిమా అన్నట్లుగా నటిస్తోంది.

త్వరలో నిశబ్దం చిత్రం తో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో మరో ప్రయోగాత్మక ఛాలెంజింగ్ పాత్రను అనుష్క చేసింది. మాటలు రాని.. చెవులు వినిపించని పాత్రలో ఈమె నటించినట్లుగా తెలుస్తోంది. నిశబ్దం సినిమాతో అనుష్క తన 15 ఏళ్ల సినీ కెరీర్ లోకి అడుగు పెట్టబోతుంది. మళ్లీ అనుష్క బిజీ అవ్వాలని ఆమెను కమర్షియల్ పాత్రల్లో కూడా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-