ప్రభాస్ తో పెళ్లిపీటలపై కూర్చున్న ఫొటోపై అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్

0

ఇటీవలే ట్విట్టర్ లో యాక్టివ్ అవుతున్నట్లుగా ప్రకటించిన అనుష్క కొన్ని రోజుల్లోనే ఏకంగా మిలియన్ ఫాలోవర్స్ కు చేరువ అయ్యింది. ట్విట్టర్ లో అనుష్క తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్బంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం చెప్పింది. చాలా మంది అభిమానులు ట్విట్టర్ లో జాయిన్ అయినందుకు అనుష్కకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆమె రాబోయే సినిమాల గురించి మరియు నిశబ్దం సినిమా గురించి పలు ప్రశ్నలు అడిగారు. కేవలం సౌత్ వారు మాత్రమే కాకుండా ఉత్తరాది వారు కూడా అనుష్కతో ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సందర్బంగా ఒక ఫొటోపై అనుష్క చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.

మిర్చి సినిమా షూటింగ్ సందర్బంగా ప్రభాస్.. అనుష్కలు పెళ్లి పీఠలపై కూర్చుని ఉంటారు. ఆ స్టిల్ బాగా ఫేమస్ అయ్యింది. పెళ్లి పీఠలపై పెళ్లి దుస్తుల్లో ఇద్దరు కూడా నిజంగా దంపతుల మాదిరిగా ఉన్నారంటూ అప్పట్లోనే టాక్ వచ్చింది. తాజాగా ఆ ఫొటోను ట్వీట్ చేసి ఒక మాటలో కామెంట్ చెప్పండి అంటూ ఒక అభిమాని అడిగిన సమయంలో అనుష్క స్పందిస్తూ.. సీన్ గురించి మాట్లాడుకుంటున్న సమయంలో తీసిన ఫొటో అది. అందరికి అది నచ్చడంతో పోస్టర్ గా కూడా విడుదల చేశారు.

ఈ సినిమా నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. యూవీ క్రియేషన్స్ లో నేను చేసిన మొదటి సినిమా ఇదే అంటూ ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో అనుష్క కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఫేస్ బుక్.. ఇన్ స్టా.. ట్విట్టర్ అన్ని చోట్ల ఆమెను మిలియన్స్ లో ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. ట్విట్టర్ లో కూడా ఆమె ఫాలోవర్స్ సంఖ్య త్వరలో రికార్డ్ స్థాయిలో నమోదు అవ్వడం ఖాయం అంటున్నారు.