కోహ్లీకి తూకం వేసి అన్నం పెడుతున్న అనుష్క !

0

క్రికెట్ టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత ఫిట్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫిట్నెస్ కి మరోపేరు విరాట్ కోహ్లీ. విరాట్ ఇండియన్ టీం లోకి వచ్చిన తరువాతనే టీం ఫిట్నెస్ పై ద్రుష్టి పెట్టింది. కోహ్లీ గ్రౌండ్ లో చిరుతలా పరుగెత్తడానికి కారణం ఫిట్నెస్. ఎక్కువ సేపు జిమ్ లో గడుపుతూ భారత ఆటగాళ్లందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అయితే కరోనా వైరస్ కారణంగా జిమ్కు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కోహ్లీ తమ ఫిట్నెస్ను కాపాడుకోవడానికి ఇంట్లోనే కష్టపడుతున్నాడు.

ఈ కరోనా వైరస్ కారణంగా దాదాపుగా నాలుగు నెలలుగా టీమిండియా ఆటగాళ్లంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఫ్రీ టైం లో విరాట్ కోహ్లీ అతని భార్య అనుష్క శర్మలు ఆనందంగా గడుపుతున్నారు. ఇద్దరు కలిసి వంట చేస్తున్న వీడియోలు సరదాగా గడిపే ఫొటోలను సోషల్ మీడియాలో ఇప్పటికే పోస్టు చేశారు. విరాట్ కోహ్లీ ఆహారానికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను బుధవారం అనుష్క ఇన్స్టాలో షేర్ చేశారు.

విరాట్ కోహ్లీ ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యత ఇస్తాడు అన్న సంగతి తెలిసిందే. అందుకే విరాట్ ఏది తిన్నా కూడా కొలిచే తింటాడు. దీనికి ఓ ఉదాహరణే ఈ వీడియో … వంటగదిలో బరువును కొలిచే మిషన్ పై పోహా రైస్ ను ఉంచి అది సరిగ్గా వంద గ్రాములు వచ్చే వరకు కొంత వేస్తూ తీస్తూన్న వీడియోను తన ఇన్ స్టా స్టోరీస్లో అనుష్క షేర్ చేసారు. దాంట్లో ఎక్కువైనా దాన్ని తీసేయడం తక్కువైతే కొంచెం వేయడం సరదాగా అనిపిస్తుంది. ఈ ఇంట్లో ఇలా కొలిచి తింటాం. దానికి కారణం కోహ్లీ’ అని అనుష్క కామెంట్ ను జత చేశారు.