ట్రెడిషనల్ లుక్ లో అదిరిన బొమ్మాళి!

0

సౌత్ అంతా పాపులర్ అయిన హీరోయిన్ల లిస్టు తీస్తే అందులో తప్పనిసరిగా అనుష్క శెట్టి పేరు ఉంటుంది. నయనతార తర్వాత అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ కూడా స్వీటీనే. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా కూడా అనుష్క సొంతం. ఫ్యాన్ ఫాలోయింగ్ లో కూడా అనుష్క రేంజే వేరు. అందుకే అనుష్క ఫోటో ఏదైనా సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు క్షణాల్లో వైరల్ అయిపోతుంది.

ఈమధ్య అనుష్క ఒక ఆలయ సందర్శనకు వెళ్ళింది. ఈ సందర్భంగా ట్రెడిషనల్ లుక్ లో తెలుపు రంగు చూడిదార్ ధరించి నుదుటన బొట్టుతో కనిపించింది. ఈమధ్య అనుష్క బరువు తగ్గిందని లేదు పెరిగిందని ఎన్నో వార్తలు వచ్చాయి కానీ వాటిని పక్కన పెడితే అనుష్క ఫేస్ లో ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. ఎంతో సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ ఫేస్ లో గ్లో ఉంది. అయితే అభిమానులకు ఒకటే బాధ. ‘బాహుబలి’ అనుష్క సినిమాలు చాలా స్లోగా చేస్తోంది. హీరోయిన్ కెరీర్ ఎక్కువ కాలం ఉండదు కాబట్టి అనుష్క సినిమాలు చేయడంలో వేగం చూపించాలని అభిమానులు కోరుతున్నారు.

అనుష్క తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాధవన్.. అంజలి.. షాలిని పాండే.. మైఖేల్ మ్యాడ్సెన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అనుష్క కెరీర్ లో ‘అరుంధతి’ లాగా ఒక మైల్ స్టోన్ గా నిలుస్తుందేమో వేచి చూడాలి.