అనుష్క మనసు పడిన హీరో అతడే

0

అనుష్క. స్వీటీ.. తాజాగా తన 15 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. తాజాగా ఆమె నటించిన ‘నిశ్శబ్ధం’ మూవీ ప్రి రిలీజ్ వేడుకకు ఏకంగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి డాషింగ్ పూరి జగన్నాథ్ సహా హేమాహేమీలైన వారు వచ్చి స్వీటి అనుష్క గొప్పదనాన్ని మంచిదనాన్ని వేయినోళ్ల పొగిడేశారు. ఆమె అంత మంచిది.. అమయాకురాలిని తెలివైనది ఇంకొకరు లేరని ప్రశంసించారు. జక్కన్న అయితే అనుష్క మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని కలుపుకుపోయారు.

మీడియాతో మాట్లాడుతూ తన 15 సినీ ప్రస్థానం గురించి స్వీటీ అనుష్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు నటన అంటే తెలియని తాను ఇక్కడి వరకూ వస్తానని అనుకోలేదన్నారు. తొలి సినిమా షాట్ లో కెమెరా ముందు సరిగ్గా నిలబడలేని తాను ఇంత గొప్ప స్థాయి అసలు సినిమాల్లోకి వస్తానని అనుకోలేదన్నారు.

తన సినీ ప్రయాణంలో అరుంధతి బాహుబలి రుద్రమదేవి సైజ్ జీరో వేదం సినిమాలు ఎవర్ గ్రీన్ అని అనుష్క చెప్పుకొచ్చారు. సింగం సినిమాలో మంచులో కూరుకుపోయి గాయాలయ్యాయని తెలిపారు.

ఇక అనుష్కకు ప్రభాస్ తో సహా పలువురు హీరోలతో పెళ్లి అని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రభాస్ తో రిలేషన్ షిప్ పై కూడా అనుష్క తాజాగా స్పందించారు. నిప్పు లేకున్నా పొగ సృష్టించే వాళ్లు ఉన్నారని.. తనకు ఎవరితోనూ సంబంధం లేదన్నారు. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ తోనూ తాను పెళ్లి అన్నట్టు రాశారని అనుష్క తప్పుపట్టారు.

ఇక తన కలల హీరో.. మనసుకు బాగా దగ్గరైన హీరో నాగార్జున అని అనుష్క చెప్పుకొచ్చారు. తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన నాగార్జుననే నా ఫేవరెట్ హీరో అని అనుష్క తెలిపారు. తన దృష్టిలో స్టార్ హీరో చిరంజీవి అని ఆయనో లెజెండ్ అంటూ చెప్పుకొచ్చారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-