అనుష్క పుస్తకంలో అన్నీ ఉన్నాయట!

0

కొంతమంది హీరోలను చూడండి.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెయిట్ తగ్గుతారు.. పెరుగుతారు. అమీర్ ఖాన్.. విక్రమ్.. ప్రభాస్ లాంటి వారు ఈ కేటగిరీలో ఉంటారు. సినిమా క్యారెక్టర్ ను బట్టి వెయిట్ మారుతూ ఉంటారు. అయితే అందరికీ ఇది వీలు కాదు. అనుష్క విషయంలో ఈ వెయిట్ ఎక్స్ పరిమెంట్ పూర్తిగా మిస్ ఫైర్ అయింది. ‘సైజ్ జీరో’ సినిమా కోసం ఫుల్లుగా తినేసి లడ్డూలాగ మారింది. సినిమా పూర్తయింది. మళ్ళీ స్లిమ్ముగా మారేందుకు ఎన్ని కష్టాలు పడినా కుదరలేదు.

‘బాహుబలి 2’.. ‘భాగమతి’ సినిమాల కోసం అనుష్క స్లిమ్ లుక్ లో కనిపించేందుకు విజువల్ ఎఫెక్ట్స్ వాడారని కూడా టాక్ ఉంది. ఈ ఇబ్బందులు అన్నీ ఎదుర్కొన్న తర్వాత ఆస్ట్రియాలో ఒక న్యాచురల్ థెరపీ తీసుకున్న తర్వాత మళ్ళీ సన్నబడింది. తన వెయిట్ లాస్ జర్నీని.. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ట్రైనర్ లుక్ కోటినో తో కలిసి ఒక పుస్తకరూపంలోకి తీసుకొచ్చింది. “ది మ్యాజిక్ వెయిట్ లాస్ పిల్” అనేది ఆ బుక్ టైటిల్. ఈ పుస్తకానికి క్యాప్షన్ “62 లైఫ్ స్టైల్ చేంజెస్”. ఈ పుస్తకం మార్కెట్ లోకి వచ్చి ఇప్పటికే రెండు మూడు నెలలు అయింది కానీ తాజాగా ఈ పుస్తకాన్ని అనుష్క అభిమానులు సోషల్ మీడియాలో పాపులర్ చేస్తున్నారు.

అనుష్క ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక కాంటెస్ట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేవారు తమ ఆరోగ్యకరమైన జీవన శైలి గురించి.. అది తమకు ఎలా ఉపయోగపడిందో వివరించాలి. ఇలా ఈ పోటీలో పాల్గొన్న వారిలో నుంచి కొందరిని ఎంపిక చేసి అనుష్క ‘ది మ్యాజిక్ వెయిట్ లాస్ పిల్’ పుస్తకాన్ని బహుమతిగా అందిస్తారట. ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘సైలెన్స్’ అనే చిత్రంలో నటిస్తోంది.
Please Read Disclaimer